-లబ్ధిదారులతో ముఖాముఖీ
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి స్వంత ఇంటి కల సాకరం కోసం ఇంటి నిర్మాణాలు చేపట్టడం లో అందిస్తున్న సహకారం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చెయ్యడం ప్రజల సంతృప్తి స్థాయి ని వెల్లడిస్తోందని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో జగనన్న కాలనీ లో ఇంటి నిర్మాణాలను ఆకస్మికంగా సందర్శించి, మౌలిక సదుపాయాలు, తదితర వాటిపై లబ్ధిదారులతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. సుమారు రూ.35 లక్షలు ఖరీదు చేసే స్థలం తో కూడిన స్వంత ఇంటి సాకారం పై ఏవిధంగా స్పందిస్తారని అడుగగా పై విధంగా కృతజ్ఞతలు తెలిపారు. ముడి సరుకులు, ఆర్ధిక చేయూత ప్రభుత్వ పరంగా అందించామని, త్వరలోనే మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో జేసీ వెంట ఆర్డివో ఎస్. మల్లిబాబు, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్, ఎంపిడివో జగదాంబ,, , తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News