-రెండో వారం కూడా ఉచిత బస్సు సౌకర్యం
-ఉదయం 9 గంటల నుంచి మ.2 వరకు ఉచిత ట్రిప్పులు
-కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఫిర్యాదులని ఏప్రిల్ 18 (సోమవారం) కలెక్టరేట్ లో కూడా స్వీకరించడం జరుగుతుందని, ప్రజల సౌకర్యం కోసం ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత శనివారం ఒక ప్రకటన లో తెలియచేసారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం ధవళేశ్వరం లో ఉన్న న్యాక్ (ఎన్. ఏ. సి) భవనంలో కలెక్టర్ కార్యాలయం నకు స్పందన కార్యక్రమానికి ప్రజలు రావడానికి వీలుగా ఉదయం 9 నుంచి మ. 2 వరకు తాత్కాలికంగా ఉచిత బస్సు సర్వీసు ఆర్టీసీ బస్టాండ్ నుంచి అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. స్పందనలో ఫిర్యాదు లు అందచేసే ప్రజల కోసం ఉచిత బస్సు ను ఏప్రిల్ 18 వ తేదీన నడుపుతున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన ఫిర్యాదులను గ్రామ/వార్డు సచివాలయాల్లో , రెవెన్యూ, మండల స్థాయి కార్యాలయాల్లో కూడా స్వీకరించడం జరుగుతుందని, ఫిర్యాదిదారుల కి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మోరంపూడి నుంచి వేమగిరి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న న్యాక్ భవన సముదాయంలో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. రాజమహేంద్రవరం కి పలు రూట్లలో నడిపే ఆర్టీసీ బస్సులు సోమవారం రోజున ఉదయం కొన్ని బస్సులు కలెక్టరేట్ మీదుగా నడిపేలని ఆర్టీసీ అధికారులను ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
Prajavartha Online Telugu News