-ప్రజా భాగస్వామ్యముతో పారిశుధ్య వారోత్సవాలు చేపట్టాలని
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ్ సర్వేక్షణ్ లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా చేపట్టవలసిన చర్యలపై కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., కౌన్సిల్ హాల్ నందు ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో ముఖ్యంగా నగర ప్రజలకు పరిసరాల శుభ్రత, చెత్త సేకరణ విధానము, స్వచ్చ సర్వేక్షణ్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ, నగరపాలక సంస్థ చేపట్టిన అన్ని కార్యక్రమములలో ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగర పరిధిలో అన్ని వార్డ్ లలో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను సద్దిం చేసుకొని నగరం మొత్తం వాటిని అమలు చేసేలా చూడాలని సూచించారు. ప్రధానంగా వారంలో మొదటి రోజు ప్రజలకు అవగాహన కార్యక్రమము, 2వ రోజు జీరో గ్యార్బేజ్, వాల్ పెయింటింగ్ మరియు IEC ఆక్టివిటీస్, 3వ రోజు డ్రెయిన్ క్లీనింగ్, 4వ రోజు ప్లాస్టిక్ బ్యాన్, 5వ రోజు డ్రై డే మరియు 6వ రోజు ప్లాంటేషన్ మరియు ముగ్గులు వేయు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి స్పెషల్ అధికారి వారికీ కేటాయించిన వార్డ్ లలో విధిగా పై తెలిపిన కార్యక్రమము చేపట్టి ప్రజలకు పారిశుధ్య నిర్వహణ పట్ల అవగాహన కల్పిస్తూ అన్ని కార్యక్రమములలో ప్రజలను భాగస్వాములను చేయాలనీ అన్నారు అదే విధంగా స్వచ్చ్ సుర్వేక్షణ్ కు సంబందించి సిటిజెన్ ఫీడ్ బ్యాక్ పై కూడా దృష్టి సారించి ఈ సంవత్సర మన నగరం మెరుగైన ర్యాంక్ సాదించే దిశగా చూడాలని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి మరియు 32 మంది స్పెషల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News