-లబ్దిదారులకు లేఔట్ స్థలములపై అవగాహన కల్పించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గృహ నిర్మాణలపై లబ్దిదారులకు అవగాహన కల్పించి అధికారులు గృహ నిర్మాణం వేగవంతం చేయాలని కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు శనివారం కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్ తో కలసి వివిధ శాఖల అధికారులతో వైఎస్ ఆర్ జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకంపై సమీక్షా సమావేశము నిర్వహించారు. విజయవాడ నగరాన్నికి సంబందించి ఉప్పులూరు, వణుకూరు, సూరంపల్లి, వెదురుపావులూరు, కొండపావులూరు లేఔట్ స్థలములలో లబ్దిదారుల వివరాలు, గృహ నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో జాప్యం జరగకుండా స్పెషల్ ఆఫీసర్లు దృష్టి సారించి ఆయా ప్రదేశాలలో ఎంపిక కాబడిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే విధంగా వారిని చైతన్యవంతులను చేయవలసిన భాద్యత వార్డ్ ఎనిమిటి, వెల్ఫేర్ సెక్రెటరి, వాలెంటరీ మరియు వి.ఆర్.ఓ లపై ఉందని అన్నారు. అదే విధంగా లేఔట్లలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. లబ్దిదారులకు బ్యాంకుల నుండి బుణాలు సత్వరమే మంజూరు చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని మరియు సంబందిత కాంట్రాక్టు కూడా గృహ నిర్మాణాలు వేగవంతముగా చేపట్టి పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, స్పెషల్ ఆఫీసర్లు, హౌసింగ్, యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది పలువురు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News