సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి…

-10 వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
-కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పదోవ తరగతి పరీక్ష లను అత్యంత పక్బందీగా నిర్వహించడం లో సంబంధించిన శాఖాధికారుల సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు గురువారం సాయంత్రం విద్యా, రెవెన్యూ, పోలీస్, పోస్టల్, తదితర శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఏప్రిల్ 27 నుంచి మే 5 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించే ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, 23 వ తారీఖు నాటికి ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. 10 వ తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ మీడియట్ పరీక్షలకు అవసరం అయిన కార్యాచరణ తో రూట్ మ్యాప్ తో సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి హల్ టికెట్ చూపితే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసి అధికారులకు సూచించారు. విద్యుత్ కొరత లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల లో ధారాళంగా వెలుతురుతో పాటు ప్యాన్స్, లైటింగ్ , త్రాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రాల కు చేరాలని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదన్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఏ ఎన్ ఎమ్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రశ్న పత్రాలు నిర్ణీత సమయం లోగా చేరేలా చూడాలని, సంబంధించిన కేంద్రం నుంచి పరీక్షలు ముగిసిన అనంతరం జాబు పత్రాలు రవాణా విషయంలో అత్యంత భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీ ఈ ఓ అబ్రహం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *