-వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతం పరిశీలన
-కమీషనర్ దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం దిశగా అడుగులు వేస్తోందని నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెలుగుబంద లో గృహనిర్మాణ ప్రాంతాన్ని నేడు సందర్శించి క్షేత్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దినేష్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వప్రాధాన్యత పథకాల అమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు. ఆదిశలో జగనన్న ఉచిత గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. లబ్ది దారుల తో మాట్లాడి ఇళ్ల నిర్మాణం లో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించాలన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..లబ్ధిదారులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఈ నెలాఖరు నాటికి కనీసం 200 ఇళ్లకు పైగా గ్రౌండింగ్ వర్క్ జరిగేలా చూడాలన్నారు. అనంతరం తోర్రేడు లో టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించారు. మొదటి దశ లో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోయే లబ్దిదారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని సిద్దంగా ఉండాలన్నారు. కమిషనర్ వెంట అడిషనల్ కమీషనర్ సత్యవేణి, సెక్రెటరీ కాళీబాబు, ఇతర సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News