రఘుదేవపురం లే అవుట్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రఘుదేవపురం గ్రామంలో 6 లే అవుట్ లలో 1584 మంది లబ్ధదారులకు నవరత్నాలు పేద లందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పట్టాలు పంపిణీ చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళ వారం సీతానగరం మండలం రఘుదేవపురం లే అవుట్ ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన ఇళ్ళు లేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సొంత ఇంటి కల సాకారం చెయ్యడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ గ్రామం లో 38 ఎకరాలను గుర్తించి 1584 లే అవుట్ లను సిద్దం చేశామన్నారు. మూడు ఎకరాల భూమి లో లెవెలింగ్ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. లే అవుట్ ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం అవసరమైన సిమెంట్, ఇసుక, స్టీల్ అందుబాటులో ఉంచడం తోపాటు , ఇంటి నిర్మాణానికి అనువుగా నీటి వసతి, విద్యుత్ సరఫరా కోసం సంబందించిన అధికా రులతో సమన్వయం చేసుకోవాలన్నారు. లే అవుట్ లో చేపట్టవలసిన పనులపై సూచనలు చేశారు. తహసిల్దారు , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *