367 ఆర్బీకే లు ద్వారా 8,200 క్వింటాళ్లు వరి విత్తనాలను రైతులకు పంపిణీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ పంటకు జూన్ నెల 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగుతున్న దృష్ట్యా రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తం అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి 367 ఆర్బీకే లు ద్వారా 8,200 క్వింటాళ్లు వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 59 వేల క్వింటాలు విత్తనాలు అవసరం ఉన్నప్పటికీ, ఇందులో 90 శాతం మేర రైతులే సొంత విత్తనాలను వినియోగించుకుంటారని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతాంగానికి కావలసిన ఎరువులు పురుగుమందులు ఇప్పటికే జిల్లాలోని ఆర్.బి.కె. కేంద్రాల్లో 11 వేల మెట్రిక్ టన్నులు స్టాక్ సిద్దంగా ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. జాన్ మాసంలో పంట వేయడం వలన అక్టోబర్ మాసంలో కోతకు వస్తుందని, తద్వారా నవంబర్ లో వచ్చే తుఫాను,వరదల నుంచి రైతాంగం నష్టపోకుండా పంటను కాపాడుకో గలరాన్నారు. అదేవిధంగా రెండవ పంట రబీ డిసెంబరు మాసంలోనే నాటు వేసుకొని మార్చి నెల కి పూర్తి పూర్తి అవడం వలన ఏప్రిల్, మే మాసంలో వచ్చే తుఫాన్ బారి నుండి పంటను కాపాడుకోగలమని ఆయన తెలిపారు. ఈ మధ్యలో మూడవ పంట గా మినుము, పెసర ఇతర పచ్చిరొట్ట పంటలను వేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికతో సమావేశమై రైతాంగానికి మూడు పంటలు పండించేందుకు ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేసిందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని రైతన్న గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *