పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత అందరిపైనా ఉంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్‌ యస్‌డిల్లీరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె మోహన్‌కుమార్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని నీరు, నేల, గాలిని కలుషితం చేయొద్దని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి గ్లోబల్‌వార్మింగ్‌ అంతకంతకు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మండల కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు, సచివాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఆదేశించామని కలెక్టర్‌ అన్నారు. రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేవిధంగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ డిల్లీరావు విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని కలుషితం చేయకుండా కాపాడుకుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించి సమాజ భవిష్యత్తుకు పాటుపడాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. అనంతరం తహాశీల్థార్లు, కలెక్టరేట్‌లోని వివిధ సెషన్ల అధికారులు, సిబ్బందితో పర్యావరణాన్ని పరిరక్షిస్తానని కలెక్టర్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *