రోటరీ మహా కాలేశ్వర ఆలయాన్ని సందర్శించిన పూజలు నిర్వహించిన కలెక్టర్ దంపతులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లో నిర్మించిన రోటరీ మహా కాలేశ్వర ఆలయంలో కలెక్టర్ డా. కె. మాధవీలత దంపతులిద్దరూ ఆదివారం తెల్లవారుఝామున దేవ దేవుడు ని దర్శించుకుని, భస్మాభిషేకం పూజాను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ నిర్మాణకర్త రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కూరెళ్ల ఆదిత్య కుమార్ శర్మ , తదితరులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. తదుపరి ఆలయం లో పూజాధికాలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందచేసి, అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందచేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 64 ఆలయ నమూనా దేవతామూర్తు లను కలెక్టర్ దంపతులు దర్శనం చేసుకుని, మూల విరాట్ ఆలయంలో పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన మైన నగరంగానే కాకుండా సాంస్కృతిక , సామాజిక సేవా కేంద్రంగా , విశాలమైన గోదావరి తీరం, ఆధ్యాత్మిక కేంద్రం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు . ఈ నగరం పర్యాటకకేంద్రంగానే కాకుండా టెంపుల్ పర్యాటక కేంద్రంగా కూడా మంచి గుర్తింపు తేవడానికి ఆస్కారం ఉందన్నారు. ఈ అధ్భుతంగా శ్రీ మహాకాలేశ్వర్ ఆలయాన్ని నిర్మించడం పట్ల రోటరీ క్లబ్ ప్రతినిధులను, పట్టపగలు వెంకట్రావు వారి కృషిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమం లో రోటరీ అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *