అన్నదేవరపేట గ్రామంలో 21 చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ…

-కస్టమ్ హైరింగ్ సెంటర్ రైతులకు మూడు ట్రాక్టర్లు అందచేత
-అన్నదేవెరపేటలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలతో మమేకమైన మంత్రి తానేటీ వనిత

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి , ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకాలు అందించడానికి గ్రామ/ వార్డ్ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను మన ముఖ్యమంత్రి జగనన్న తీసుకు రావడం జరిగిందన్నారు. ఈరోజు గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రయోజనాలు ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవడం కోసం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చామన్నారు. ప్రతి చోట ప్రజలు జగనన్నకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, వ్యవసాయ యంత్ర పరికరాలు సి.హెచ్.సి. లలోని రైతులకి సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయుతను ఇవ్వడం, ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటు ఇసుక స్టీల్ వంటి ముడి సరుకులను లేఅవుట్ వద్దే లబ్ధిదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఇంటి నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

పంచాయతీకి 21 చెత్త రిక్షాలు అందచేత :
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ భాగంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంమంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఎవరికి వారు తన ఇంటిలో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. పంచాయతీ పరిధిలో వచ్చే గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది కి పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా ఇవ్వాలని తెలియజేశారు.

జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్, పోసిన శ్రీలేఖ, యం. పి. పి. జొన్నకూటి పోసిరాజు, సర్పంచ్ ఎలిప్ సుధారాణి, ఎంపీడీఓ యం.రాజశేఖర్, తహశీల్దార్ శర శాంతి, వ్యవసాయ శాఖ ఎ. ఓ, రుచిత, పలువురు యం. పి. టి. సీలు, స్థానిక నాయకులు కాకర్ల వెంకటేశ్వరరావు, కృష్ణ దేవరాయలు, పిట్టా శ్రీను, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదతరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *