ఉదయం 9.30 నుంచి స్పందన కార్యక్రమం

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణంలో విపరీతమైన వేడి పరిస్థితుల దృష్ట్యా 13.06.2022 సోమవారం రాజానగరం నియోజకవర్గ స్థాయి లో నిర్వహించే జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం ఉదయం 9.30 నుంచి జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేశారు. జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం ఈ వారం రాజానగరం నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. రాజానగరం, NH-16, ఎస్సార్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న “మాధవి ఫంక్షన్ హాల్” వద్ద వెంటనే 9.30 AM నుండి ప్రారంభమవుతుందని, జిల్లా అధికారులందరూ ఉదయం 09:15 గంటలకు స్పందన వేదిక వద్దకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం కి రెండవ స్థాయి అధికారులు కలెక్టరేట్, న్యాక్ భవనం, రాజమహేంద్రవరంనకు ఉదయం 9.15 కి హాజరు కావలసి ఉంటుందన్నారు. డిఆర్వో ఆధ్వర్యంలోపిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్ కి వొచ్చే వారి కోసం ఉదయం 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *