-అక్కడ అమలు చేస్తున్న పలు అంశాలపై అధ్యయనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా సోమవారం కార్పొరేటర్ల బృందం ఆగ్రా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నందలి ఆగ్రా పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర మంత్రి వర్యులు ఎస్.పి. సింగ్ భాగెల్, మేయర్ నవీర్ జైన్, ఆగ్రా శాసన సభ్యులు జీ.ఎస్ ధర్మేష్, కమిషనర్ నిఖిల్ తికారాం పాండే ఐ.ఏ.ఎస్ లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆగ్రా మున్సిపల్ కార్పోరేషన్ వారి కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యకలాపాల పర్యవేక్షణ, పారిశుధ్య నిర్వహణకు సంబందించి మైక్రో పాకెట్ ద్వారా నివాసాల నుండి చెత్త సేకరణ విధానం, ఎమర్జెన్సీ కాల్ బాక్ సిస్టమ్, పబ్లిక్ గురించి వివరించారు. అడ్రస్ సిస్టమ్, అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, స్మార్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మొదలగు అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ సారధ్యంలో డిప్యూటీ మేయరు అవుతు శ్రీ శైలజ, యం. ఎల్. సి యం. డి రూహుల్లా, టి.డి.పి కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ లతో కూడిన కార్పొరేటర్ ల బృందం మరియు వి. ఏ. ఎస్ డా. రవి చంద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News