-కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ 2021 పంట నష్టాలను సకాలంలో అంచనావేసి ఆ నష్ట పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడంజరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత తెలిపారు. మంగళవారం 2021 ఖరీఫ్ పంట వైఎస్సార్ ఉచిత పంటల బీమా రాష్ట్ర క్లెయిమ్లు, రు. 15.61 లక్షల మంది రైతులకు రూ. 2977.82 కోట్లు రైతుల ఖాతాల్లో శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమచేసారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, సీతానగరం ఎం పిపి జ్యోత్స్న , రైతులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాదవీ లత మాట్లాడుతూ , గత ఖరీఫ్ 2021లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతుల పంట నష్టాలు ఉచిత బీమా పథకం కింద ఎన్యూమరేషన్ చేశామన్నారు. ప్రస్తుతం పంట నష్ట పరిహారం రైతుల కు జమ చెయ్యడంతో, ఈ 2022 ఖరీఫ్ సీజన్ ప్రారంభం సమయంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఈ మొత్తం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గత వారం రైతు భరోసా కింద సహాయం అందించామన్నారు.జిల్లాలో 2021 ఖరీఫ్ పంటకు సంబంధించి వైస్సార్ ఉచిత బీమా గా 30,267 మంది రైతులకు రూ 59.49 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు.
డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అర్భికెల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పించడం జరుగుతోందన్నారు. రైతులు ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటారని, ప్రజలకు కూడా , ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు.
మండలాల వారిగా.
అనపర్తి మండలం లో 6,263 మంది రైతులకు రు.621.96 లక్షలు,
బిక్కబోలు మండలం లో 7,034 రైతులకు రు. 936.72 లక్షలు,
గోపాలపురం మండలం లో 649 మంది రైతులకు రు.10.79 లక్షలు,
దేవరపల్లి మండలం లో 223 మంది రైతులకు రు.59.35 లక్షలు,
నల్లజర్ల మండలం లో 323 రైతులకు రు.29.04 లక్షలు,
కొవ్వూరు మండలం లో 987 మంది రైతులకు రు.398.52 లక్షలు,
చాగల్లు మండలం లో 245 మంది రైతులకు రు.87.17 లక్షలు,
తాళ్లపూడి మండలం లో 636 మంది రైతులకు రు.109.42 లక్షలు,
నిడదవోలు మండలం లో 5,836 మంది రైతులకు రు.1,826.51 లక్షలు,
ఉండ్రాజవారం మండలం లో 2,818 మంది రైతులకు రు.504.01 లక్షలు,
పెరవలి మండలం లో 2,238 మంది రైతులకు రు.800.14 లక్షలు,
రాజమహేంద్రవరం (రురల్) మండలం లో 30 మంది రైతులకు రు.18.29 లక్షలు,
కడియం మండలం లో 2,259 మంది రైతులకు రు.198.54 లక్షలు,
రాజానగరం మండలం లో 8 మంది రైతులకు రు.3.01 లక్షలు,
కోరుకొండ మండలం లో 556 మంది రైతులకు రు.247.09 లక్షలు,
సీతానగరం మండలం లో 728 మంది రైతులకు రు.321.82 లక్షలు
Prajavartha Online Telugu News