-అనంతరం అనపర్తి, బిక్కవోలు అధికారులకు దిశా నిర్దేశం
-పనుల లో జాప్యం పై జేసీ అసహనం
-ఎస్ హెచ్ జి లో లేని వారిని గ్రూప్ గా ఏర్పాటు చర్యలు తీసుకోవాలి
-జేసీ శ్రీధర్
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటి నిర్మాణాలలో స్టేజ్ కన్వర్షన్ కు అత్యధిక భాగం కావాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం అనపర్తి , బిక్కవోలు మండలాలకు చెందిన రెవెన్యూ పంచాయతీ రాజ్, హౌసింగ్, సర్వే, ఆర్.డబ్ల్యూ.ఎస్. తదితర శాఖ ల అధికారులతో హౌసింగ్ లేఅవుట్లు ఇంటి నిర్మాణాలు ఓటిఎస్ పై నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హౌసింగ్ నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా స్టేజ్ కన్వెన్షన్ లో ప్రతి వారం ప్రగతి చూపాలన్నారు. లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంటు ఇసుక తదితర ముడిసరుకులు లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా కాలనీలలో జరిగే నిర్మాణాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అవసరమైన ముడి సరుకు డిమాండ్ మేరకు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలని మండల స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన ఇసుక సిమెంట్ లేక నిర్మాణాలు అయిపోతే సంబంధిత శాఖ అధికారులు అన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను జెపి సంస్థతో మాట్లాడి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. హౌసింగ్ అధికారులు ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు నిర్మాణాల ప్రగతిని ఆన్లైన్ చేయడం ద్వారా లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఓటీఏస్ కి సంబంధించి అనపర్తి లో 29, బిక్కవోలు లో 11 మందికి సంబందించిన డేటా ఎంట్రీ చెయ్యవలసి ఉందని, సాంకేతిక పరమైన సమస్య వలన పూర్తి చెయ్యలేక పోయినట్లు అధికారులు వివరించారు. ఇంటి నిర్మాణం కొరకు అవసరమైన రుణాలను ఇప్పించాలన్నారు. బిక్కవోలు పరిధిలో 1004 మందిలో 744 మంది ఎస్ హెచ్ జి లో ఉండగా 469 అర్హులుగా ఉన్నారని, ఇప్పటి వరకు కేవలం 106 మందికే రుణాలు మంజూరు పై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులలో లేని లబ్ధిదారులతో గ్రూపు ఏర్పాటు చేసి రుణాలను అందచేయాలని డి ఆర్ డి ఎ అధికారులను ఆదేశించారు. అనపర్తి మండలంలో 2259 మంది లబ్ధిదారులకు గాను 1348 మంది బి బి ఎల్ స్థాయిలో ఉండడం పై వివరణ కోరగా, వచ్చే వారానికి ప్రగతి చూపుతామని అధికారులు వివరించారు. సమావేశంలో డి ఆర్ డి ఎ. పిడి ఎస్. డేగలయ్య, తహశీల్దార్లు శశిధర్, కే వి మాధవరావు, ఎంపిడివో లు పి. వీణ దేవి, భవాని, హౌసింగ్, తదితర శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News