రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారులు మరియు భవనముల శాఖ వారిచే కంబాల చెరువు నుండి కొంతమూరు వరకు 5.6 కిలోమీటర్ల రోడ్, విలువ రూ.331 లక్షలు, పీరియోడికల్ మైంటెనన్స్ పనులను బ్రధరెన్ చర్చ్ జంక్షన్ వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతోందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో,రవాణా వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఎంపీ భరత్ రామ్ అధికారులకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన రెడ్డి నియోజక వర్గంలో ఉన్న రోడ్ల మరమత్తులు కోసం వేల కోట్లు రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే రాజమహెంద్రవరం నగరం కొరకు ప్రత్యేక గ్రాంట్ కింద రూ. 125 కోట్లు, అలాగే ఆర్ అండ్ బి రోడ్ల పీరియోడికల్ పనులకు రూ.331 లక్షలు ఇవ్వడం జరిగిందని, ఆ పనులకు చేపట్టేందుకు ఈ రోజు శంకుస్థాపన చెయ్యడం చాలా ఆనందం గా ఉందన్నారు. అలాగే నగరంలో సుమారు 15 చోట్ల రోడ్లను చూస్తే అభివృద్ది ఏమేరకు జరుగుతున్నది అర్థం అవుతుందని ఎంపీ తెలిపారు. ఎవరు ఏమి అన్నా, ఏది మాట్లాడినా, జగన్ అన్న సూచనలు మేరకు పని చేస్తూ, నగర అభివృద్ది కి నా పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నేను అండగా వుంటానని ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీనివాస్, నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ నందం స్వామి, టికే విశ్వేశ్వరరెడ్డి, లక్కోజుల ఓంకార్, హసీనా బేగం, మార్గాని సురేష్, మార్గాని బుజ్జి, జాల నటరాజ్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News