రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ తహశీల్దార్లు పరిధిలో 22ఎ భూమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల జారీ చేశారని, ఆ మేరకు త్వరలో పెండింగ్ దరఖాస్తు లను క్లియర్ చేయ్యాడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జె సి ఛాంబర్ లో ఆరు మండలాలకు చెందిన 22 ఏ దరఖాస్తు లపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జిల్లాకు చెందిన వివిధ మండలాలకు చెందిన 14 దరఖాస్తులు స్వీకరించామన్నారు. మొత్తం 14 కేసులు ప్రాసెస్ చేయబడ్డాయన్నారు. దరఖాస్తులను ఫైళ్లను క్లియర్ చేయాలని భావిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సంబందించిన తహశీల్దార్ లని పిలిపించి కలెక్టరేట్ లోని సంబందించిన సెక్షన్ అధికారులు, సిబ్బందితో రికార్డులను పరిశీలించామన్నారు. సెక్షన్-22ఎ పరిధిలోకి వచ్చే భూమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లన్నింటినీ క్లియర్ చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోందని, ఇప్పటి వరకు వచ్చిన అర్జీలన్నీ క్లియర్ చేయనున్నామన్నారు. కలెక్టర్ డా.కే. మాధవీలత వారి ఆదేశాలను అనుసరించి మంగళవారం గోపాలపురం, దేవరపల్లి, అనపర్తి, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు మండలాలకు చెందిన దరఖాస్తు లను పరిశీలించడం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు, కలెక్టర్ పరిపాలన అధికారి జి. భీమారావు, పర్యవేక్షకులు (ల్యాండ్) కే శ్రీనివాస్ , సంబందించిన మండలాల తహశీల్దార్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News