ఈనెల 19వ తేదీన లోన్స్‌ మరియు డిపాజిటల్స్‌పై అవగాహన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మిణ్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మజ్జిగ చలివేంద్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ శర్వాణిమూర్తి, సొసైటీ మేనేజర్‌ జి.శ్రీనివాస్‌, సొసైటీ సిబ్బంది వితరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్వాణీమూర్తి మాట్లాడుతూ సొసైటీ గత రెండున్నర సంవత్సరాలలో 14 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసిందని తెలిపి, రానున్న రోజులలో మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతుందని, వాటి ద్వారా బ్రాహ్మణులందరూ రుణలబ్ది పొందాలని కోరారు.
ఈ సందర్భంగా మేనేజర్‌ జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ ఆదివారం ఉదయం గాయత్రి కన్వెన్షన్‌ హాలులో సొసైటీ యొక్క లోన్స్‌ మరియు డిపాజిటల్స్‌పై అవగాహన కార్యక్రమం వుంటుందని దానికి మన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి అందరూ హాజరై సభ్యత్వం పొంది, రుణాలు పొందాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *