విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత విద్యను అభ్యసించి కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ శిక్షణ, సమాజ సేవల ప్రాజెక్టులు నిర్వహించి ఖచ్చితమైన మార్గదర్శికాలు చూపేందుకు చర్యలు చేపట్టాలి.
వారం రోజుల్లో కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలి` జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు.
ఉన్నత విద్యలో ఉద్యోగ శిక్షణపై కన్వెన్షనల్ డిగ్రీ పోగ్రామ్ మరియు ఇంజినీరింగ్ ప్రోగ్రమ్లు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో ఇంటర్షిప్, అప్రెంటిస్‌షిప్‌లో శిక్షణ మలిదశ, శిశ్శరికంలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు అనే అంశంపై ప్రభుత్వ జివో నెంబర్ 9 ని అమలు చేయడం పై జిల్లా స్థాయి కమిటీలు యూనివర్సిటీ రిజిస్ట్రాల్లు, పరిశ్రమ శాఖ ప్రతినిధులతో మంగళవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమాజ సేవా, నైపుణ్య అభివృద్ధిని విద్యార్థులు పొందగలగాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు జీవో నెంబర్ 9 ని విడుదల చేశారన్నారు. ఆఖరి అర్థ సంవత్సరంలో ఇంజనీరింగ్, కళాశాల విశ్వవిద్యాలయాల విద్యర్థులకు, క్షేత్రస్థాయిలో బోదన, నైపుణ్యం అభివృద్ధి, సమాజ సేవా వంటి అంశాలపై శిక్షణ ఇంచేందుకు గ్రామాలలోను, పరిశ్రమల వద్ద సంబంధిత ప్రాంతాలలో అవసరమైన సదుపాయాలు సామాగ్రిని అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు సెక్టారు వారిగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై సమగ్ర నివేధికను వారం రోజులో సిద్దం చేయాలని కలెక్టర్ అదేశించారు. బిటెక్ పార్మసీ వంటి సాంకేతిక పరమైన విద్యర్థులకు ఏపిఐఐసి శాఖ ద్వారా పరిశ్రమలకు సంబంధించి శిక్షణ కొరకు సౌకర్యాలను సిద్దం చేయాలని రసాయనీక శాస్త్రం, భౌతిక శాస్త్రం, సామాజిక శాస్త్రానికి సంబంధించి భాష విషయాలపై 6 నెలల కోర్సుపై శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వృత్తి పరమైన అవగాహన పొందడంలో తాజా వృత్తీర్ణతలకు సహాయ పడుతుందన్నారు. సామాజిక సేవా, బాష వలన వ్యాపార వృత్తిలో రాణించేందుకు ఉపయోగపడుతుందన్నారు. విద్యను పూర్తి చేసిన అనంతరం క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశలు పొందడంలో విద్యర్థులకు ఆత్మధైర్యన్ని కల్పించాలని కలెక్టర్ సూచించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కృష్ణా యునివర్సిటీ రిజిస్ట్రార్ రామిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కో` ఆర్డినేటర్ పార్ధసారధి, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నోడల్ అధికారి డా.కోటేశ్వరరావు, కిశోర్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News