-కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నిరోదక మరియు కంట్రోల్ యూనిట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టర్ యస్ డిల్లీరావు ఆయన కార్యాలయం నందు అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడిన రక్తదాతలను దుశ్శాలువాలు, జ్ఞాపికలు దృవపత్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరమైన సంఘటనలో క్షతగ్రాతులకు తక్షణమే స్పందించి ఇప్పటి వరకు 50 పర్యాయయాలు పైగా రక్తాన్ని దానం చేసిన దాతలు అభినందనీయలు అన్నారు. సమాజంలో ఉహించని విధంగా ప్రమాదాలు జరగడం, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు, గర్భిణీ స్త్రీలకు, శస్త్రచికిత్స సమయంలో ఆయా గ్రూపులకు సంబంధించిన రక్తం అవసరమవుతుందని, అటువంటి సమయానికి రక్తాన్ని అందించడానిక మానవత దృక్పదంతో దాతలు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా 61 పర్యాయములు (‘‘ ఏ ’’పాజిటివ్ ) రక్తాన్ని అందించిన దాత కస్తూరి విజయకుమార్, 54 పర్యాయములు (‘‘ఓ’’ పాజిటివ్) రక్తాన్ని అందించిన దాత పరుచూరి చిన్నబాబు, పోన్‌కాల్స్ వాట్స్‌అప్ ద్వారా దాతలను సమకూర్చి 7వేల యూనిట్స్ అందించిన గంగుల అనూషాను, పోన్‌కాల్స్ వాట్స్‌అప్ ద్వారా దాతలను సమకూర్చి 23 పర్యాయములు (‘‘ఏబి’’ పాజిటివ్ )ను 4వేల యూనిట్స్‌ను అందించిన ఇమ్మడి శెట్టి వెంకటేశ్వరరావును, ఆగస్టు 2020`21 నుండి ప్రతీ నెల కొక సారి రక్తదానం నిర్వహించి రక్తాన్ని అందిస్తున్న కృష్ణా జిల్లా లారీ ఒనర్స్ అసోసియేషన్ వారిని, విద్యార్థులను సమన్వయపరచి ప్రతీ నిత్యం రక్తం అందిస్తున్న ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల వారిని, వాలంటీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి నిత్యం రక్త దాతలను సమన్వయ పరుస్తున్న
విటిపియస్ సంస్థ యు. శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం వారిని జిల్లా కలెక్టర్ సన్మానించారు. ముందుగా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం వారు రక్తదాతలపై తయారు చేసిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో డియంహెచ్‌వో డా. సుహసిని, అడిషనల్ డియంహెచ్‌వో డా. ఉషారాణి, ఐసిడిఎస్ పిడి ఉమాదేవి, ప్రోగ్రామ్ మేనేజర్ పి కిరణ్, చైల్డ్ లైన్ కో`ఆర్డినేటర్ అరవరమేష్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News