అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర


రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ధవళేశ్వరం గ్రామంలో శ్రీ శ్రీదేవి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుంచే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పలు చోట్ల నుండి మహిళలు బోనాలను పోలేరమ్మకు తీసుకొనివచ్చి సమర్పించారు. పోలేరమ్మ ఆలయం అంతా భక్తులతో నిండిపోయింది ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పోలేరమ్మ తల్లీ. పోలేరమ్మా తల్లీ.. అంటూనే పోలేరమ్మను దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త యం కృష్ణారావు పార్వతమ్మల కుమారుడు యం రాజుబాబు సాయిలక్ష్మీ లు పోలేరమ్మ కు పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ పోలేరమ్మ జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి అనేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. పోలేరమ్మ జాతర మూడు రోజైన మంగళవారం ఉదయం నాడు పూజరిని అమ్మవారిగా అలంకరించి ధవళేశ్వరం గ్రామంలోని పోలేరమ్మ ఆలయం నుండి ఊరేగింపుగా బైపాస్ రోడ్డు లో కొలువైన శ్రీ శ్రీదేవి పోలేరమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. మధ్యాహ్నం నాడు గోదారమ్మకు పూజలు చేసి నది ఒడ్డున ఉన్న రావిచెట్టుకు పసుపు రాసి, కుంకుమ బొట్లను పెట్టి ముత్తయిదుగా చేసి అలంకరించారు. రాజుబాబు సాయిలక్ష్మి దంపతులకుచే అక్కడికి విచ్చేసిన మహిళలకు పసుపు కుంకుమ జాకెట్లను అందజేశారు. సాయంకాలం నాడు బాజాభజంత్రీలతో వివిధ వేషధారణలతో డాన్సులు వేస్తూ పోలేరమ్మ ను పలు వీధుల్లో ఊరేగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *