అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సీఎం వైయస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. కాగా, దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్ఎఈలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చిందని అధికారులు.. సీఎం జగన్కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే ఒరవడి కొనసాగాలన్న సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ ఏటా.. క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలి. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో పంప్డ్ స్టోరేజీ పవర్ ద్వారా వాల్యూ అడిషన్ చేస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. దీనివల్ల గ్రీన్ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News