స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటరు నమోదు కు సంబందించిన 891 క్లైమ్ లు పరిష్కరించ వలసి ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టడం ద్వారా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్) జిల్లా ఎన్నికల అధికారి డా.కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో పలు అజెండా అంశాలపై వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా వివరాలు తెలుపుతూ, జిల్లాలో రిజిస్టర్/అన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు చెంది 7 నోటీస్ లకు గాను 5 అందచేసమని, ఇరువురికి సంబంధించిన చిరునామా లో వారు లేకపోవడం తో అందించడం జరగలేదన్నారు.

జిల్లాలో ఓటరు నమోదు, అభ్యంతరాలు కి సంబందించిన 891 లో 120 దరఖాస్తులు 60 రోజుల పైబడి పెండింగులో ఉన్నాయని, వాటిని తక్షణం డిస్పోస్ చేసేలా క్షేత్ర అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. మొత్తం పెండింగ్ దరఖాస్తులు అన్ని పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలియచేశారు. ఓటర్ల జాబితా సవరణ కు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బూత్ లెవెల్ అధికారులు, ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓ లకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని అన్నారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే భర్తీ చేయడం జరుగుతుందని తెలియ చేశారు. జిల్లా ఎన్నికల విభాగం ద్వారా జనాభాపరంగా సారూప్య నమోదులు (DSE) , ఫోటో సారూప్య నమోదు (PSE) చేపట్టడం జరుగుతోందన్నారు. జాతీయ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (NGRS) కి సంబందించిన పిర్యాదులు లేవనీ కలెక్టర్ తెలియచేశారు. ఈ సమావేశం కు డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *