రోడ్ల పై చెత్త కనిపిస్తే ఉపేక్షించేదిలేదు…

-సామాజికబాధ్యతగా నగర పౌరులు పొడి తడి చెత్త ను విడివిడిగా అందచెయ్యండి
-కమీషనర్ కె.దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిశుభ్రత విషయంలో తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నానని, అయినా కొన్ని చోట్ల రోడ్ లపై చెత్త కనిపిస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించినా ఉపేక్షించేది లేదన్నారు. శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరం లో శానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటరీ సూపర్వైజర్ లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, పలు సూచనలు చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టి నప్పటి నుండీ మెయిన్ రోడ్, ఇతర ముఖ్యమైన కుడాళ్ళల్లో , వాణిజ్య ప్రాంతాల్లో రాత్రి పూట శానిటేషన్ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఆ చర్యలు సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇకపై నగరంలో మరిన్ని ప్రాంతాలకు రాత్రి పూట శానిటేషన్ ప్రారంభిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. రాత్రి పదిన్నర నుండి ఉదయం నాలుగు గంటల వరకూ జరుగుతున్న ఈ పద్దతి వల్ల జన జీవనానికి ఏ విధమైన అసౌకర్యం కలుగదన్నారు. కొన్ని ఫ్లోర్ పాయింట్స్ వద్ద బయట ఎక్కువ చెత్త కనిపిస్తోందని., ప్లాస్టిక్ కవర్లను రోడ్ మీద వేసేస్తున్నారన్నారు.
కనుక అలాంటి పాయింట్ లలో ప్రజలు ఎవరూ కవర్ల లో చెత్త వేయకుండా.. పెయింటింగ్ లు వేయడం గానీ.. పూల కుండీలు ఏర్పాటు చేయడం గానీ చేయాలన్నారు. ప్రతి ఇంటి నుండీ నిర్దేశించిన డస్ట్ బిన్ లలో,తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి,చెత్త సేకరణ సిబ్బంది కి విధిగా అందించేలా చూడాలన్నారు. సామాజిక బాధ్యతగా నగర పౌరులు ఈ విషయం లో తమకు పూర్తి సహకారాన్ని ఇవ్వాలన్నారు. నగరఅభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం తో యూజర్ చార్జీలు వసూలు ను పెంచాలని దినేష్ కుమార్ సూచించారు. మన నగరం.. మన శుభ్రత నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్ హెచ్ వో డాక్టర్ వినూత్న,ఎస్.ఎస్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *