-అందులో భాగంగా ఆదివారం శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం..
-కలెక్టర్, ఎంపి, నగర కమిషనర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ను పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న ప్రణాళికలపై చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ మిని సమావేశ మందిరంలో ఎంపి మార్గని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పరిధిలో రూ.125 కోట్లతో చేపట్టవలసిన 16 పనులపై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. పై పనులను చేపట్టడంలో భాగంగా విడుదలైన రూ.15 కోట్ల తో చేపట్ట వలసిన పనుల పై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మునిసిపల్ కమిషనర్ ను, అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణ చర్యలు తీసుకోవాలసి ఉందన్నారు. నాగుల చేరువ ప్రాంతం, కోటిపల్లి బస్టాండ్, రైల్వే అండర్ బ్రిడ్జి, కోటగుమ్మం, మోరంపూడి, విటి కాలేజ్ రోడ్, గోదావరి రివర్ బండ్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తు కార్యాచరణ కు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతూనే, ట్రాఫిక్ సమస్య లేకుండా అడుగులు వెయ్యల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన పనుల్లో అవసరమైన సవరణలను ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. ఆర్ వో బి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఫుట్ వే బ్రిడ్జి నిర్మాణ పనుల సూచనలు చెయ్యడం జరిగింది.
మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ, కంబాల చెరువు ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. చెరువు , పరిసరాలను పరిశుభ్ర పరచడం, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా నీటిని పరిశుభ్రం చెయ్యడం, కిడ్స్ – గేమ్స్ జోన్, లోటస్ పాండ్, గ్లాస్ బ్రిడ్జి, తదితర పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. పార్క్ లో చేపట్టే అభివృద్ధి పనులు కోసం కొద్ది రోజుల పాటు మూసి ఉంచాల్సి ఉంటుందని తెలియచేశారు. సందర్శకులు, ప్రజలకు ఈ విషయం తెలియచేసేలా నోటీసు బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో భాగంగా 19.5.2022 న కలెక్టర్, ఎంపి , శాసనసభ్యులు , మునిసిపల్ కమిషనర్ అధ్వర్యం లో తీసుకున్న నిర్ణయం, వాటికి అనుగుణంగా చేపట్టిన పనులు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తొలుత కబేళ పై చర్చిస్తూ, ఇప్పటికే స్టేక్ హోల్డర్స్ లతో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగిందని దినేష్ కుమార్ తెలియచేశారు. ఆర్ ఓ బి, ఎమ్.ఎల్.సి.పి, గోదావరి రివర్ బండ్, కంబాల చెరువు సమగ్ర అభివృద్ధి , రివర్ ఫ్రంట్ రోడ్, నాగుల చేరువు వద్ద పురపాలక స్టేడియం లో క్రికెట్, ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చేర్చిండం జరిగింది. మోబిలిటీ యాక్షన్ ప్లాన్ పైన చర్చించారు. నగర ట్రాఫిక్ సమస్య నివారణకు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కంబాల చెరువు ను మరింత అభివృద్ధి చేసి నగరంలో ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చి దిద్దడం పై సమావేశం లో అన్ని కోణాల్లో సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇప్పటికే మే 19 నాటి అంశాలలో చర్య అంతర నివేదికను అధికారులు సమర్పించారు. కబెళ రోజు వారి సామర్థ్యం, వినియోగం పై వ్యాపారులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసు కోవడం జరిగింది.
ఇండోర్ స్టేడియం, కంబాల చెరువు సమగ్ర అభివృద్ధి కార్యాచరణ, ఈట్ స్ట్రీట్, రివర్ ఫ్రంట్ బండ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, తదితర అంశాలపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించడం జరిగింది.
సమావేశం లో శాసన సభ్యులు జక్కంపూడి రాజా, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఎస్సిఈ జి. పాండురంగరావు, అర్విఏస్ శేషగిరి రావు, ఎమ్ వి రాజారావు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News