రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు వై ఎస్ ఆర్ నగర్ లే అవుట్ లేవిలింగ్ పనులు పూర్తి చేసే ప్రక్రియ ను జూన్ 21 నాటికి సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిడదవోలు మునిసిపల్, అనుబంధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనులలో భాగంగా ఉచితంగా స్థలాలు అందించే కార్యక్రమంలో చేపడుతున్నామన్నారు. నిడదవోలు మునిసిపాలిటీ పరిధిలో వై ఎస్ ఆర్ నగర్ (వృధ్యశ్రమం దగ్గర) 39.6 ఎకరాలలో మూడు లే అవుట్ లలో 1873 లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. లే అవుట్ మెరక పనులకు సంబంధించి నిధులు అందుబాటులో ఉన్నా ఆ స్థాయి లో పనుల్లో ప్రగతి చూపకపోవడం ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలని, త్వరితగతిన పూర్తి చేసే విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నాటికి క్షేత్ర స్థాయి లో పురోగతి సాధించాలన్నారు. కాంట్రాక్టర్లను గుర్తించాలని, అవసరమైతే కమ్యూనిటీ స్థాయి పనుల విభజన చెయ్యడం పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంసి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, హౌసింగ్ డి ఈ సిహెచ్. బాబురావు, నిడదవోలు మునిసిపల్ కమిషనర్ సిహెచ్. పద్మావతి , తహశీ్ల్దార్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News