-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
తాళ్ళ పూడి, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల పధకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం సాయంత్రం తాళ్ళపూడి గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందించిన ఘనత మన ప్రభుత్వాని దన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చిన నాయకుడు జగనన్న అన్నా రు. అమ్మఒడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధకాలు పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నిరవేర్చే దిశగా, రాష్ట్రం లో 32 లక్షల మందికి పైగా ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వండం జరుగుతొందన్నారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇ చ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్యలని వనిత పేర్కొన్నారు. వనిత ఇంటింటికి వెళ్లి ఈ 3 సంవత్సరాలలో ప్రభుత్వం అంద చేసిన సంక్షేమ పధకాలు వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నక్క అనూరాధ, జెడ్. పి వైస్. చైపర్సన్, పోసిన శ్రీ లేఖ, ఎ. యం. సీ. ఛైర్మెన్ వి. గంగధర శ్రీనివాస్, బండి పట్టాభి రామా రావు, కాకర్ల వెంకటేస్వర రావు, నక్కా చిట్టిబాబు, గూడ విజ యరాజు, పోసిన శ్రీ కృష్ణ దేవ రాయులు, యం. పి. డి. ఓ, యం.రాజశేఖర్, తాహిసీల్దార్, శర శాంతి, కొవ్వూరు నియో జకవర్గ నాయకులు, అధికా రులు తదితరులు పాల్గొ న్నారు.
Prajavartha Online Telugu News