విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం…

-కలెక్టర్ మాధవీలత
-గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో చర్చించిన పలు అంశాలను, సూచనలను జిల్లా స్థాయిలో చర్చిస్తాం..
-ప్రతి రైతు ఈ-క్రాప్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి..
-ఆర్బీకేల్లో ఏటీయంలు ఏర్పాటుకు చర్యలు..
-సీసీ ఆర్సీ కార్డుల కాల వ్యవధి 11 మాసాలు మాత్రమే..
-జిల్లా కలెక్టరు డా.కె.మాధవీలత

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విత్తనం నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయంపై ప్రోత్సాహన్ని కల్పిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తోందని జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన తొలి జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలం చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు, జాయింట్ కలెక్టరు సిహెచ్.శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖాధికారి మాధవరావు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు డా. కె.మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపపాలన వికేంద్రీకరణలో భాగంగా నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పటికే సచివాలయాలు, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రైతాంగానికి వ్యవసాయంలో పలు సూచనలు, సలహాలు అందించేందకు వ్యవసాయాధికారులను అందుబాటులో ఉంచిందన్నారు. ఆర్బీకేలు ద్వారా రైతాంగానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారన్నారు. వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో గ్రామ, మండల స్థాయిలో చర్చించిన పలు అంశాలను జిల్లా స్థాయిలో చర్చించి వాటి పరిష్కారం నిమిత్తం రాష్ట్ర స్థాయి వ్యవసాయ సలహా మండలికి పంపడం జరుగుతుందన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి రైతు అండగా ఉండాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రతి రైతు ఈ – క్రాప్ తప్పని సరిగా నమోదు చేసుకోవడంతో పాటు తాను పండించే భూమి మొత్తం ఈ – క్రాప్ లో నమోదయ్యిందో లేదో సరి చూసుకోవాలన్నారు. ఈ – క్రాఫ్ నమోదు వలన ఇన్ ఫుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ రాయితీలు రైతాంగానికి వర్తిస్తాయన్నారు. ప్రతి ఈ – క్రాఫ్ నమోదుచేసుకునేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సీసీఆర్సీ కార్టులు కాలవ్యవధి 11 మాసాలు మాత్రమే ఉంటుందని, దీని పై భూయజమానులకు వచ్చే వారం నుండి గ్రామాల వారీ అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు వ్యవసాయానికి కావలసిన పైకం తీసుకొనేందుకు వీలుగా ప్రతి ఆర్బీకేలో బ్యాంకింగ్ వ్యవస్థను నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటికే 23 ఆర్బీకేల్లో ఏటీయంలను ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లును కోరామన్నారు.

జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆధుకోవాలన్నారు. రైతులను భాగస్వామ్యులను చేస్తు వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. గ్రామస్థాయిలో మొదటి శుక్రవారం మండల స్థాయిలో రెండవ శుక్రవారం సమావేశాలు నిర్వహించి వాటిలో వచ్చిన సమస్యలు జిల్లాలో స్థాయిలో చర్చించి రాష్ట్ర స్థాయికి పంపడం ద్వారా రైతాంగ సమస్యలకు పరిష్కారం కలుగుతుందనే దృక్పధంతో రైతులను భాగస్వామ్యులను చేసారన్నారు. గత ప్రభుత్వం రైతాంగానికి పట్టించుకోలే దన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇంకా కొంత మంది రైతులకు ధాన్యం సొమ్ము అందలేదని వెంటనే అధికారులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్బీకే స్థాయిలోనే రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను అందిస్తూ ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చుతామన్నారు. రైతులకు అన్నివిధాల సహాయ సహకారాలను అందిస్తామని చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు అన్నారు.

జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్. మాధవరావు జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు, రంగపేట , గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, గోకవరం, కోవ్వూరు, చాగల్లు, ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి, కడియం మండల సమావేశాల్లో చర్చించిన పలు అంశాలైన మురుగు కాల్వలు, సాయిల్ టెస్టింగ్, సీసీకార్డులు, పచ్చి రొట్టవిత్తనాలు, వైఎస్సార్ సున్నావడ్డీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ, ఖరీఫ్ విత్తనాల రకం,టిష్యూ బనానా, సూక్ష్మ పోషకాల రాయితీ, వరి విత్తనాలు లభ్యత, ఈ- క్రాఫ్ సాంకేతిక సమస్యలు వంటివి సమావేశం దృష్టికితీసుకు వచ్చారు. జిల్లాలో 834 క్వింటాళ్ళు రైతులకు పచ్చి రొట్ట విత్తనాలను అందించామన్నారు. జిల్లాలో జూన్ 1 వ తేదీనే కాలువలకు నీరు విడుదల చేసినందున 20 వేల హెక్టార్ల వరకు నారు మళ్లు వేసేందుకు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఈ-పంట నమోదు, ఆర్బీకేల ద్వారా రాయితీ పై విత్తనాలు అందించడంతో పాటు పొలంబడి కౌలు రైతులకు సాగు ధృవీకరణ పత్రాలను అందించామన్నారు.

ఎస్ ఈ ఇరిగేషన్ రాంబాబు వివరిస్తూ తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాల ప్రాంతాలకు జూన్ 1 వ తేదీనే కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కాలువ శివారు ప్రాంతాలకు కూడా సాగునీటిని అందింస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ పై సభులులేవనెత్తిన పలు అంశాలపై వివరఇస్తూ అనపర్తి కాలువకు గుర్రపుడెక్కను తొలగిస్తామన్నారు. అదేవిధంగా రాజానగరం పరిధిలో గలప్రాంతాల్లో చెక్ డామ్ లు మరమ్మత్తులు, నూతన చెక్ డామ్ లునిర్మాణం వంటి అంశాలను ఉన్నతాధికారుల దృష్టికితీసుకువెళతామన్నారు.
జిల్లా ఉద్యాన వన శాఖాధికారి యు. రాథా కృష్ణమాట్లాడుతూ ఉద్యాన వన పంటలు అభివృద్దిలో భాగంగా 3,800 హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించామని,ఇప్పటి వరకు 1300 రైతులను రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందన్నారు. 5 హెక్టార్ల లోపు గలవారికి 90శాతం, ఆపై 12.5 హెక్టార్లు వరకు గల రైతులకు 50శాతం సబ్సిడీ అందిస్తాన్నారు. అదేవిధంగా బనానా క్రాప్ కు సందించి యంఐడీపీ రకానికి హెక్టారుకు మొదటి ఏడాదికి రూ.30,739రూపాయలు, రెండవ ఏడాది రూ,10,266 రూపాయలు సబ్సిడీ అందించడం జరుగుతుందని ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు.
ఈసందర్బంగా పలువులు సభ్యులు సమావేశంలో మండల స్థాయిలోని పలు అంశాలను చర్చించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టరు సి.హెచ్ శ్రీధర్, ఎస్సీ ఇరిగేషన్ రాంబాబు, జిల్లా హార్టికల్చర్ అధికారి యు రాధాకృష్ణ, జిల్లా సెరికల్చర్ అధికారి బియంవి రామరాజు, ఎస్ ఈ విద్యుత్ శాఖ టివిఎస్ఎన్ మూర్తి, డియం జిల్లామేనేజర్ కె.తులసీ, డిడి డీఆర్సీ వి. బోసుబాబు, పలువులు సైంటిస్టులు, సభ్యులు కంటేవినయ్ తేజ్, దోసకాయలపల్లి, ఎల్.శ్రీనివాసరావు,చాగల్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *