విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 34 వ డివిజన్ దేశాయిపేటలోని మునిసిపల్ హైస్కూల్లో 800 మంది విదార్థినివిద్యార్థుల సంఖ్య దాటిపోతున్ననేపథ్యంలో 1 కోటి 98 లక్షల 52 వేల 556 రూపాయలతో 17 తరగతి గదులు ( 9 గదులు బహిరంగంగా నిర్మాణం జరగనుండగా , 8 గదులు పై అంతస్తుగానిర్మించనున్నారు) అలాగే 9 వ డివిజన్ పరిధిలోని చిలకలపూడి పాండురంగ మునిసిపల్ హైస్కూల్లో 678 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండటమే కాక సమీపంలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలుగా మార్పుచెందాయి. ఆ పరిస్థితులలో అక్కడ విద్యార్థిని విద్యార్థులు సుమారు 600 మంది ఇక్కడ పాఠశాలలో చేరే అవకాశం ఉంది. ప్రభుత్వం 72 లక్షల రూపాయల వ్యయంతో 6 తరగతి గదులు నిర్మించనుండగా, మచిలీపట్నం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ చలమలశెట్టి వెంకటలక్ష్మి తనయుడు చలమలశెట్టి అనిల్ మరో 6 అదనపు తరగతుల నిర్మాణానికి తన స్వంత ఖర్చుతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
శుక్రవారం ఉదయం నాడు – నేడు రెండవ విడత ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పేర్ని నాని పాల్గొని అదనపు తరగతుల నిర్మానానికి భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, మన బడి – నాడు నేడు స్కీమ్ 2019-20 నుంచి ప్రారంభం అయ్యిందని చెబుతూ, మూడేళ్ల వ్యవధిలో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరించి స్కూళ్లకు కొత్త రూపాన్ని సంతరించే లక్ష్యంతో ఈ పథకం రూపుదిద్దుకొందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును తగ్గించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని విప్లవాత్మకంగా తీసుకువచ్చిందని చెప్పారు. పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, టాయిలెట్ల నిర్మాణం, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్స్, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్స్, ఆన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ గోడలు ఏర్పాటుచేస్తున్నరని తెలిపారు. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కార్పొరేట్కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయిన్నారు.పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.అందమైన బొమ్మలతో పూల మొక్కలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారని చెప్పారు. దీంతో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయిని ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మునిసిపల్ కమీషనర్ జి. చంద్రయ్య, మునిసిపల్ ఎం ఇ త్రినాధరావు, ఏ ఇ పిల్లి ప్రసాద్, చిలకలపూడి పాండురంగ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వి వి వి కనక దుర్గా, 34 వ డివిజన్ కార్పొరేటర్ బడే రేవతి భాను, 33 వ డివిజన్ కార్పొరేటర్ మీర్ అస్గర్ ఆలీ, మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యురాలు మట్టా తులసమ్మ, 9 వ డివిజన్ ఇంచార్జ్ రాసంశెట్టి జానకి రమణ ( చంటి ), చలమలశెట్టి గాంధీ, శీలం బాబ్జి, గాజుల భగవాన్, బూరుగ రామారావు తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *