Breaking News

రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ఆసుపత్రిగా విజయవాడ జిజిహెచ్‌ని తీర్చిదిద్దుదాం…

-మౌలిక వసతుల అభివృద్ధిలో దాతల సహకారం అవసరం…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునాతన మౌలిక వసతులతో విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జిజిహెచ్‌)ని అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలను అందించడంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారం కూడా ఎంతో అవసరమని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వరల్డ్‌ విజన్‌ ఇండియా సంస్థ అందించిన మెడికల్‌ కిట్స్‌ వితరణ కార్యాక్రమానికి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ మాతాశిశు సంక్షేమం వికలాంగుల సంక్షేమం, కమ్యూనిటీి ప్రాజెక్టుల అభివృద్ధిలో వరల్డ్‌ విజన్‌ ఇండియా సంస్థ అంధిస్తున్న సహకారం మరవలేనిది అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి దాదాపు 15 లక్షల రూపాయలు విలువైన వైద్య వినియోగ వస్తువులను అందించి ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడం ద్వారా రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఆసుప్రతిగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో 24 గంటలు యంఆర్‌ఐ ఎక్స్‌రై సేవలను అందించడం జరుగుతుందని వైద్య నిపునులతో గుండె చికిత్స ఆపరేషన్లను సామాన్యులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ఆసుపత్రి నిర్వహణలో అధికారులు ఆసుపత్రి వైద్యలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించామన్నారు. ఆసుపత్రి లోపల పరిసరాల ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ద్య కార్యక్రమాలను నిర్వహించి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో డ్రైనేజ్‌ వ్యవస్థ అభివృద్ధికి టాయిలెట్ల నిర్వహణ ఎయిర్‌ కండిషన్‌ మరమత్తులకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.త్వరలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్వహించి చేపట్టావలసిన అభివృద్ధి పనులపై చర్చించి తగు నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.
మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లాలలోనే కాకుండా పరిసర జిల్లాలలో ఎటువంటి ప్రమాదాలు జరిగిన క్షతగాత్రులు విజయవాడ ప్రభుత్వ ఆసుప్రతికి చికిత్సకొరకు తరలి వస్తారన్నారు. అధునాతనమైన మౌలిక వసతులతోపాటు అనుభవజ్ఞలైన వైద్యులతో చికిత్స అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రికి మంచి గుర్తింపు ఉందన్నారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు దాతలు స్వచ్చంద సంస్థలు మానవీయకోణంలో ఆలోచించి ముందుకు వచ్చి సహకారం అందించాలన్నారు. వరల్డ్‌ విజన్‌ ఇండియా సంస్థ 15 లక్షల రూపాయలతో 20సెమిఫ్లోవర్‌బెడ్స్‌, 15 వీల్‌ఛైర్స్‌, 20 డెస్ట్‌బిన్స్‌, 15 థర్మల్‌స్కానర్స్‌, 500 పిపిఇకిట్లు, 3వేల ఎన్‌`95 మాస్క్‌లు, 50 ఆక్సిమీటర్లు, 10 శానిటైజర్లు స్టాడ్స్‌, 5 వేల గ్లౌజులు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు వైద్యసేవలను అందించడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి, వరల్డ్‌ విజన్‌ ఇండియా సంస్థ సీనియర్‌ మేనేజర్‌ తబితా ఫ్రాన్సిస్‌, టెక్నికల్‌ స్పెషలిస్ట్‌ వి. సాంబశివరావు, ప్రేమదార సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ నందిగం జోషిబాబు, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *