-కలెక్టర్. డా.కె.మాధవీలత
-ఎస్పీ..ఐశ్వర్య రస్తోగి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చేయి చేయి కలిపి “సైబర్ క్రైం ఫ్రీ సిటీ”గా మన జిల్లాను రాజమహేంద్రవరం ను తీర్చిదిద్దుతాం మని కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. స్థానిక శ్రీవెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో శనివారం సైబర్ జాగ్రత్త లు మరియు జాతీయ రక్షణ పై కార్యసాల నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ డా.కే మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటి వరకు అందరూ సైబర్ నేరాల, సాంకేతిక అంశాలపై మాట్లాడి ఉంటారు, ఐతే సమాజం లో మంచి చెడూ రెండూ ఉంటాయి. దొంగనాలు, హత్యలు జరిగేవి, ఇప్పుడు మనకు తెలియకుండా చేడులోకి వెళ్ళడం జరుగుతోంది. సైబర్ నేరాల కు మనకు తెలియకుండానే గురి అవుతున్నాం… గతంలో భౌతికంగా స్నేహితులు ఉంటే, ఇప్పుడు స్నేహితులందరూ, వివిధ మాద్యమాలలో ఫాలోవర్స్ ఆధారంగా ఉండడం జరుగుతోంది. కనపడని స్నేహితులతో కలిసి అడుగులు వేయకండి, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో మంచిది, ఐతే ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుందని మంచి చెడులను తెలుసుకుని అడుగులు వేయలన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భం “సైబర్ అపరాధ్ సే అజాధి – అజాధి కా అమృత్ మహోత్సవ్” జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా సూపరింటెండెంట్ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.
కంప్యూటర్ను సాధనంగా లేదా తదుపరి నేరాలకు పాల్పడే మార్గంగా ఉపయోగించే అన్ని రకాల నేరపూరిత చర్యలు సైబర్ నేరాల కిందకు వస్తాయన్నారు. కంప్యూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం లేదా టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్లపై దాడి చేయడం.. ఈ రెండూ చట్టవిరుద్ధమైన చర్యలే అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సైబర్ టెర్రరిజం.. వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే సైబర్ పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ డిఫమేషన్.. ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ గ్యాంబ్లింగ్, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన, ఫిషింగ్, క్రెడిట్ కార్డు మోసాలు వంటివి వివిధ రకాల సైబర్ నేరాలుగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఊమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూస్ లలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సైబర్ నేరాల జరిగితే “9121211100” “112” – “181”లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.సైబర్ దాడులకు గురైనవారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలన్నారు. సైబర్ దాడులకు గురైనవారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలి. అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చునన్నారు.
నన్నయ్య యూనివర్సిటీ డీన్ డా పి. సురేష్ వర్మ మాట్లాడుతూ, 18 వ శతాబ్దం లో బలం ప్రభావం చుపేవి, 19 వ శతాబ్దం లో డబ్బు ఆ స్థానంలో ఆక్రమించుకుంటే, 20 వ శతాబ్దంలో మేధస్సు,/ సాంకేతిక పరిజ్ఞానం ఆక్రమించు కుందన్నారు. కంప్యూటర్ సిస్టమ్స్ లేదా నెట్‌వర్క్‌లను అక్రమంగా, అనధికారంగా యాక్సెస్ చేయడం లేదా హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, ఈ మెయిల్ బాంబింగ్, సలామి ఎటాక్, సర్వీస్ ఎటాక్‌ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మ్ దాడులు, లాజిక్ బాంబ్స్, ఇంటర్నెట్ టైమ్ థెఫ్ట్స్… వంటివన్నీ వివిధ రూపాల్లో ఉండే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. తప్పకుండా మీ కంప్యూటర్ లు , సెల్ ఫోన్లు అవసరం లేకపోయినా ఆన్లైన్ లో ఉండకూడదన్నారు. మెయిల్స్, ఎస్ ఎమ్ ఎస్, వాట్సాప్ మెసేజ్ తదితర సామాజిక మధ్యమాల సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రక్షణ కి, భద్రత కి , సంఘానికి విఘాతం కలిగించే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
జె ఎన్ టి యూ ప్రొఫెసర్ డా. ఎ ఎస్ ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ, సైబర్ హైజీన్, వెబ్ సైట్ ల నిర్వహణ, వినియోగం పై ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలన్నారు. ఇంటర్ నెట్ వినియోగం చేస్తున్నాం అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అన్న చందన ఉందన్నారు. ఓ ఎల్ ఎక్స్ పై జరిగే ఇంటర్నెట్ మోసాలు వివరించారు. నూటికి ఒక్కరూ కూడా జరిగిన మోసాలపై ఫిర్యాదు చేయడం లేదు. ప్రతి ఒక్కరిలో జరిగిన మోసాలపై ఫిర్యాదులు చేసేలా సమాజంలో చైతన్యం తీసుకుని రావలసిన అవసరం ఉందన్నారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొన్ని భద్రత కోసం సెట్టింగ్స్ ఉన్నాయి. 21*07829700191# గానీ 21* , 401 లతో నుంచి వచ్చే ఫోనులకు స్పందించవద్దని ఆయన తెలిపారు. *#21# ను, *#62# ను ; ##002# ను డయిల్ చేసి ప్రతి ఒక్కరి సెల్ కి భద్రత ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా “యాప్ ఆడిట్” ను డౌన్ లోడ్ చేసుకుని, ఏ ఏ యాప్ సెక్యూరిటీ ని ఇస్తాయో తెలుసుకునేందుకు సహకరించే యాప్ లను వివరించారు. గూగుల్ ఒక తల్లిగా ఎంతో సహాయం చేస్తూ సూచనలు చేస్తుందని, కొంత ఓపికతో కష్టపడి చదివితే మనకు, మన డబ్బుకు రక్షణా లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కోసం దేశంలో రాబోయే ఐదు ఏళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్) ఏఎన్ ఎన్ మూర్తి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైబర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ నిపుణులు డాక్టర్ పి. సురేష్ వర్మ, కాకినాడ జె ఎన్ టి యు ప్రొఫెసర్, సైబర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ నిపుణులు డా. ఏ.ఎస్.ఎన్.చక్రవర్తి, అడిషనల్ ఎస్పీ ఎం. రజిని, వివిధ కళాశాలల విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News