ఆర్జీల సమస్యల పై ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్‌) ఆర్జీల సమస్యల పై ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ను ద్వారా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధించిన ఆర్జీదారులు, అధికారులతో శనివారం కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దీనిలో భాగంగా పునరావృతమవుతున్న (రీఒపెన్‌) స్పందన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చేందేలా నాణ్యతతో కూడిన పరిష్కారమార్గం చూపేవిధంగా ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌ విధానాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమస్య పరిష్కరించినప్పటికి ఆర్జీదారుడు సంతృప్తి చెందక మరల స్పందనలో తిరిగి ఆర్జీని సమర్పిస్తున్నారన్నారు. ఇటువంటి ఆర్జీలను గుర్తించి ఎందుకు ఆర్జీదారుడు సంతృప్తి చెందలేకపోతున్నాడనే విషయంపై ఆర్జీదారుడు సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి కారణాలపై కూలంకుషంగా చర్చిస్తున్నామన్నారు. సమస్య పరిష్కారంలో అధికారుల లోపమున్నట్లయితే వాటిని సరిదిద్ది ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌ విధానం వల్ల స్పందనలోని ప్రతీ సమస్యకు స్పష్టమైన పరిష్కారం ఇవ్వాలనదే తమ లక్ష్యమన్నారు. ఆర్జీలను మరింత నిశతంగా పరిశీలించి వారి పరిధిలోనే సమస్యలను నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని ఆర్జీదారునికి చూపించగలుగుతారన్నారు.
శనవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్‌) 5 ఆర్జీలకు సంబంధించి ఆర్జీదారులు సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆర్జీలకు పరిష్కారం చూపారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన ఎస్‌ మాణిఖ్యం, గంపలగుడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన షేక్‌ సైదులు, నందిగామ మండలం రైతుపేటకు చెందిన యం సుభాణి, వత్సవాయి మండలం వేమవరం కు చెందిన కె రమాదేవిల రెవెన్యూ పరమైన, మైలవరం మండలం చంద్రగుడెంకు చెందిన బి శ్రీనివాసరావుల పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ రీఒపెన్‌ ఆర్జీల సమస్యలను ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించినట్లు కలెక్టర్‌ తెలిపారు.
జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, ఆర్జీదారులు ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *