మండల స్థాయిలో ఎంపీడీఓ లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి

-ఈరోజు వరకు జరిగిన ప్రతి బిల్లు అప్లోడ్ చెయ్యండి
-డిప్యూటీ ఈ ఈ, పీడీ ద్వారా ఈ ఈ లు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి
-కలెక్టర్ డా. కె మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 24 వరకు చేసిన ప్రతి పని చెల్లింపులు జరిగినవి, జరగవలసి ఉన్నవి కూడా ఎన్ ఐ సి, టి సి ఎస్ లాగిన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి హౌసింగ్, పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్., డ్వామా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు క్షేత్ర స్థాయి లోని పిఆర్, హౌసింగ్, ఆర్ డబ్ల్యు ఎస్ ల సహాయ ఇంజనీర్ లతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు వరకు జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు అన్నింటిని ఎన్ ఐ సి /టి సి ఎస్ వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. సిమెంట్ కు సంబందించిన వివరాలు కూడా అప్లోడ్ చెయ్యాలని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు మండల హెడ్ క్వార్టర్ లో ఉండాలన్నారు. డిప్యూటీ ఈ ఈ లు రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్ లో పిడి డ్వామా, పి ఆర్, ఆర్.డబ్ల్యు.ఎస్., హౌసింగ్ ఎస్ ఈ లు ఒకే చోట ఉండి ప్రతి ఒక్క పనికి సంబందించిన సమగ్రమైన వివరాలు, బిల్లులు అప్లోడ్ చేసేలా పర్యవేక్షణ చెయ్యాలని స్పష్టం చేశారు. పేమెంట్ జరగవలసిన ఎన్ ఐ సి వెబ్సైట్ లోనివి మాత్రమే కాకుండా ఇంకా పనులు పూర్తి చేసి వెబ్సైట్ లో కనపడని వాటిని కూడా వెంటనే వెబ్సైట్ లో పెట్టాలన్నారు. జిల్లాలో జరిగే ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన భవన నిర్మాణం పనులు ప్రతి ఒక్కటి అప్లోడ్ చెయ్యాలని, ఒక వేళ చెయ్యలేకపోతే మీ మీ జీతాల నుంచి చెల్లించవలసి ఉంటుందని మాధవీలత తెలిపారు. ఇప్పటి వరకూ చేపట్టిన పనులు వెబ్సైట్ లో ఉన్నవి మాత్రమే చేస్తే సరిపోదని, ఏదైనా సమస్య ఉంటే జిల్లా స్థాయి లోని అధికారులకి తెలియపరచి, సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఈరోజు నియోజక వర్గం లో ప్రజా ప్రతినిధులు పాల్గొనే గడప గడపకు కార్యక్రమానికి మీ కార్యాలయం తరపున ప్రతినిధిని పంపాలని, ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల ప్రకారం క్షేత్ర స్థాయి లో జరిగిన పనులు అప్లోడ్ కు అత్యంత ప్రాధన్యతను ఇవ్వాలని స్పష్టీకరణ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికే రెండుసార్లు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేసి ఉన్నందున పరిస్థితి ని అర్థం చేసుకోవాలన్నారు. అప్లోడ్ చేయడం లో లోపం జరిగిన సంబందించిన అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరో సారి కలెక్టర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *