అర్హులైన పేదలు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మిగిలిపోయిన లబ్ధిదారులకు జూలై 26న అకౌంట్లలో నిధులు జమ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్‌ మాసాలలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్, జూలై మాసాలలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించనున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. జూన్ 27వ తేదీన చిన్నారుల తల్లులకు అమ్మఒడి, జూలై 5 న జగనన్న విద్యాకానుక, జూలై 13న వాహనమిత్ర, జూలై 22 న కాపునేస్తం, జూలై 26 న జగనన్న తోడు పథకాలను శాచ్యురేషన్ పద్ధతిలో అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకాలతో పాటు.. వివిధ పథకాలకు అర్హులై ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు జూలై 26 న రాష్ట్ర ప్రభుత్వం వారివారి వ్యక్తిగత ఖాతాలలో నిధులు జమ చేస్తుందని వెల్లడించారు. కావున సెంట్రల్ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఆయా సచివాలయాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో అర్హులైన పేదలు పథకాలకు దూరం కాకుండా సచివాలయ సిబ్బంది బాధ్యత వహించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *