కరోనా వైరస్‌ కంటే భయంకరం డ్రగ్స్‌ వినియోగం…

-ప్రతి విద్యార్థి ఒక పోలీస్‌లా డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రగ్స్‌ వినియోగం కరోనా వైరస్‌ కంటే అతి భయంకరమైనదని ప్రతి విద్యార్థి డ్రగ్స్‌ వినియోగం పై అవగాహన పెంచుకుని అరికట్టేందుకు ఒక పోలీస్‌ మాదిరిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విద్యార్థులకు పిలుపు నిచ్చారు.
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సింపోజియం ‘‘చూజ్‌ లైఫ్‌’’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల వినియోగం కరోనా వైరస్‌ కంటే అతి భయంకరమైనదన్నారు. వీటి ప్రభావం వలన సమాజంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందన్నారు. డ్రగ్స్‌ వినియోగం అతి పెద్ద సమస్య అని ముఖ్యంగా యువత వాటి భారిన పడకుండా చూడవలసిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. నిషా ముక్త భారత్‌ కార్యక్రమం ద్వారా డ్రగ్స్‌ మాదక ద్రవ్యాల వినియోగం నివారణకు అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతున్నదన్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఎన్‌టిఆర్‌ జిల్లాలలో గంజాయి వినియోగం అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒక చెడు పరిచయం భవిష్యత్తును నిర్వీర్యం చేయడంతో పాటు జీవితాన్ని ప్రమాదంలో పడేలా చేస్తుందన్నారు. డ్రగ్స్‌ రొంపిన పడకుండా మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండి మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాల్సిన భాధ్యత స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. గతంలో కళాశాల స్థాయిలో విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ప్రస్తుతం 15 సంవత్సరాల నుండే యువత వీటి భారిన పడుతున్నారన్నారు. కృత్రిమ పొగడ్తలు ఆనందానికి ఆకర్షితులైన యువత ఒక సారి ఎలా ఉంటుందో అని మొదలు పెడితే డ్రగ్స్‌ లేనిదే ఉండలేనంతగా మారి మెదడు పై ప్రభావం చూపే స్థాయికి వెళుతున్నారన్నారు. దీని వలన యువత వారి జీవితాలను నాశనం చేసుకోవడంతోపాటు అనుకున్న ఆశయాలకు సమాది కట్టుకున్నవారవుతారని, కుటుంబ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు సంపాదన పేరుప్రక్యతలపై పెట్టే శ్రద్ద కొంత భాగం వారి పిల్లలపై పెట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలలో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యాబోదనతో పాటు పిల్లలకు మానసిక వికాసంపై బోదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్‌ మాదక ద్రవ్యాల అమ్మకాల వినియోగం వంటివి గుర్తిస్తే వెంటనే 14500 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించి నివారించేందుకు ప్రతి విద్యార్థి ఒక పోలీస్‌ మాదిరిగా కృషి చేయాలని కోరారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ద్వారా డ్రగ్స్‌ మారక ద్రవ్యాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతలో మార్పు తీసుకురావడం ద్వారానే పూర్తిగా వీటిని అరికట్టేందుకు సాద్య పడుతుందన్నారు. స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రజలను చైతన్యవంతులు చేసి డ్రగ్స్‌ మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
సమావేశంలో యంఎల్‌సి కె.ఎస్‌ లక్ష్మణరావు, డిసిపి శ్రీమతి వెంకటరత్నం, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి శౌరి, జిల్లా లిగల్‌ సర్వీస్‌ అథార్టికి చెందిన ఏ పద్మా, ప్రముఖ మానసికవైద్యురాలు డా. విజయలక్ష్మి, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా అధ్యక్షులు డా. జి సమరం, కార్యదర్శి ఇల్లా రవి తదితరులు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనార్థలు చట్టాలు కేసుల నమోదుపై ప్రసంగించారు. సిద్దార్థ డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సిద్ధార్ధ మహిళ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, పోట్టిశ్రీరాములు కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *