-ఉద్యోగులు హర్షం.. చప్పట్లతో జగనన్నకు కృతజ్ఞతలు
-మరింత నిబద్దతతో పనిచేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హామీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాల్సి ఉందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి , ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు సచివాలయ వ్యవస్థ ని చులకన చేసి మాట్లాడిన సందర్భాలను చూసాము, అయితే జగనన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది కి పైగా ఉన్న సచివాలయ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ఒక్క సంతకంతో చెయ్యడం జరిగిందన్నారు. మీరందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞత భావంతో ప్రజలకు మరింతగా సంక్షేమ పథకాలను అందచేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి రెండు కళ్లులా, చేవుల్లా సచివాలయ కార్యదర్శులు నిబద్దత తో పనిచేయాల్సి ఉందన్నారు. మీ అందరి సర్వీసుకు క్రమబద్దికరణ చేస్తూ జీ వో నంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల శుభాకాంక్షలు తెలియచేశారు. జిల్లా అభివృద్ధిలో , అర్హులకు సంక్షేమ పథకాలను చేరవేయడం మరింతగా మీ భాధ్యత పెరిగిందని కలెక్టర్ తెలియచేశారు. ప్రతి ఉద్యోగి చక్కగా పనిచేసి మంచి పేరు తీసుకుని రావలసి ఉందన్నారు.
శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విప్లాత్మకమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేసి లక్షలాదిమంది శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచన తో సిఎం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా తలుపుతట్టి వారి గుమ్మం దగ్గర సంక్షేమ పథకాలను అందచేసే వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ ఎమ్.షర్మిలా రెడ్డి , రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, జిల్లా అధికారులు, 200 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
Prajavartha Online Telugu News