ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉయ్యూరులోని 17 వార్డు లో వేంచేసి ఉన్న శ్రీ ఆరేపల్లి వారి అంకమ్మ తల్లి కొలుపు ఉత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తదుపరి రాజేంద్ర ప్రసాద్ ని ఇతర నాయకుల్ని చిత్రపటాల తో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులో ఎప్పటి నుంచో వేంచేసి ఉన్న శ్రీ ఆరేపల్లి వారి అంకమ్మ తల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా,చాలా శక్తి మంతురాలిగా పేరుగాంచారని,అదేవిధంగా ఈరోజు ఆరేపల్లి వారి ఇంటి పార్టీ వారు, ఆడపడుచులు, కమ్యూనిటీ వారు, భక్తులు అందరూ కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవంగా కొలుపులు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, మునిరెడ్డి, తెదేపా నాయకులు రాజులపాటి ఫణి, ఆలయ కమిటీ సభ్యులు ఆరేపల్లి సుబ్బారావు, ఆరేపల్లి వెంకటేశ్వరావు, ఆరేపల్లి నెహ్రూ, చలపతి శ్రీను, జంపాన తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News