మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోందని, వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని, నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లకు సూచించారు.
గురువారం సాయంత్రం ఆయన వెలగపూడి సచివాలయం నుంచి హౌసింగ్, ఓటిఎస్, స్పందన, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, హౌసింగ్ పిడి రామచంద్రన్, పంచాయతీరాజ్ ఎస్ ఇ వీరాస్వామి, జడ్పి సిఇఓ సూర్యప్రకాష్, డి ఆర్ డి ఏ పిడి , సి పి ఓ, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ జి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, గ్రామ సచివాలయం భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, సంబంధిత భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్ బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా గడువులోగా అర్జీలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులందరికీ పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. కలెక్టర్లు తరచు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీలు చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా, లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా రోజు వారి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఓటిఎస్, హౌసింగ్, గ్రామ వార్డు సచివాలయాలు మొదలైన అంశాలపై జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.
Prajavartha Online Telugu News