విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఇండియన్ ప్రజా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో దేవరపల్లి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన స్పెషల్ కేటగిరీలను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. రాష్టంలోని యస్సీ, యస్టీ లు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి పోయిందని, ఆంధ్రాకు రావలసిన ప్రత్యేక హోదాను తెచ్చుకోవడంలో తాత్సారం చేస్తున్న విషయంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుందని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలను ప్రైవేటు రంగంలో కూడా కల్పించాలని, యస్సీ, యస్టీ లకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ప్రతి ఒక్కరికి కల్పించి ఎ.పి లో కార్మిక, కర్షక, రైతు రాజ్యం తీసుకు రావాలనే లక్ష్యం తో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలమైన నినాదంతో ప్రజల ముందుకు వెళుతుందని త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలో ప్రజా సమస్యలపై జరుగు సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జై ఆంధ్రా జై బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యస్సీ, యస్టీ రిజర్వేషన్లలను పునఃసమిక్షించాలన్నారు. భూమి లేని పేద వర్గాల ప్రజలకు వ్యవసాయ భూమి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విభజన హమీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా తెస్తున్న కొత్త చట్టాలను, నల్లచట్టాలను మా పార్టీ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నేడు కార్పొరేట్ శక్తులకు, ధనవంతులకు తలవొగ్గి తెచ్చే కొత్త చట్టాలను మేము వ్యతిరేకిస్తు మేము చేపేట్టే సదస్సులను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో నాయకులు పి శ్రీనివాస్ గౌడ్, డి నాగరాజు, బత్తుల రాంబాబు, కే గంగాధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News