పి.ఎం.ఎ.వై. ( పట్టణ ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళ పధకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి.ఎం.ఎ.వై. ( అర్బన్ ) పేదలందరికీ ఇళ్ళు- నవరత్నాలు పథకం ద్వారా జి +3 విధానం లో షియర్వాల్ టెక్నాలజీ ద్వారా 2,62,000 ఇళ్ళను నిర్మించియున్నారు. వై ఎస్ ఆర్ జగనన్న నగర్ కార్యక్రమం లో తూర్పుగోదావరి జిల్లా నందు కట్టబడుచున్న మొత్తం 6304 ఫ్లాట్లు రాజమహేంద్రవరం ఫేజ్- I లో బొమ్మూరు -2528, తొర్రేడు – 896 , మోరంపూడి డి బ్లాక్ -224, వడ్డేదర కాలనీ – 256 ప్లాట్లు , ఫేజ్-II లో నామవరం 1104, సింహాచలనగర్- 96, ధవళేశ్వరం – 1200 ప్లాట్లు నిర్మించారు.

బొమ్మూరు సైట్ లో మొత్తం 3728 ప్లాట్లలో 300 చ.అ. 1888, 365 చ.అ. – 736 , 430 చ.అ. – 1104 ప్లాట్లను అంచనా విలువ రూ .255.55 కోట్ల అంచనాతో, తొర్రేడు సైట్ లో మొత్తం 896 ప్లాట్లకు 300 చ.అ. – 512 , 365 చ.అ. – 128 , 430 చ.అ. – 256 ప్లాట్లు రూ.60.66 కోట్ల అంచనా విలువతో నిర్మాణాలు జరిగాయి. తొలి దఫాగా లబ్దిదారులకు బొమ్మూరు సైట్ లో మొత్తం 3728 ప్లాట్లు అందజేయుట జరుగుతున్నది.

జూన్ -2022 లో 2528 ప్లాట్లను , డిసెంబర్ 2022 లో 1200 ప్లాట్లను అందజేయనున్నారు. జూన్ -2022లో తొర్రేడు లో 896 ప్లాట్లను లబ్దిదారునికి అందజేయుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి. 300 చ.అ. ఫ్లాట్ విలువ రూ . 6.55 లక్షలకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షను , మిగిలిన మొత్తం రూ .5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. లబ్దిదారుడు ముందుగా చెల్లించవలసిన వాటాను రూ.500 నుంచి కేవలం రూ .1/- కే ఇవ్వటం జరుగుచున్నది . 365 చ.అ. ప్లాట్ విలువ రూ . 7.55 లక్షలకు గాను కేంద్ర ప్రభుత్వం రూ .1.50 లక్షలను , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ .2.65 లక్షలను సబ్సిడీ ఇస్తుంది . లబ్దిదారుడు ముందుగా చెల్లించవలసిన వాటాను రూ .50,000 నుంచి రూ . 25,000 కె తగ్గించటం జరిగినది , మిగిలిన రూ.3.15 లక్ష లు వాయిదాల రూపంలో బ్యాంకు లోన్ ద్వారా అవకాసం కల్పించింది .

430 చ.అ. ప్లాట్ విలువ రూ . 8.55 లక్ష లకు కేంద్ర ప్రభుత్వం రూ .1.50 లక్షలను , రాష్ట్ర ప్రభుత్వం రూ .2.90 లక్షలను సబ్సిడీ ఇస్తుంది . గాను 430 చ . అ . ప్లాట్ నిమిత్తం రూ.4.15 లక్ష లకు గాను లబ్దిదారుడు ముందుగా చెల్లించవలసిన వాటాను లక్ష నుంచి రూ .50,000 కి తగ్గించటం జరిగినది, మిగిలిన రూ .3.65 లక్ష లు వాయిదాల లోన్ ద్వారా అవకాసం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ను ఉచితంగా చేయించి ఇస్తున్నారు. బొమ్మూరు లో ఫేజ్- I నందు 2528 ప్లాట్లకు గాను 1910 ప్లాట్లు , ఫేజ్- II లో 1200 ప్లాట్లకు గాను 551 ప్లాట్లు మరియు తొర్రేడు ఫేజ్- I నందు 896 ప్లాట్లకు గాను 474 ప్లాట్లు ఇంత వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 300 చ . అ . ఫ్లాట్ కు 16.00 చ.గ. , 365 చ . అ . ప్లాట్ కు 19.00 చ.గ. 430 చ.అ. ప్లాట్ కు 22.00 చ . గ . ల స్థలాన్ని ఉచితంగా లబ్దిదారునికి అందిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన బొమ్మూరు రూ .13.99 కోట్ల , మరియు తొర్రేడు రూ . 4.85 కోట్ల విలువ గల సామాజిక మరియు మౌలిక సదుపాయములను ఉచితంగా లబ్దిదారునికి అందజేస్తున్నారు. బొమ్మూరు కాలనీ లో ₹.22.23 కోట్ల తో రోడ్లు- ₹.6.68 కోట్లు, డ్రైనేజీ ₹.3.29 కోట్లు, నీటి సరఫరా ₹.3.20 కోట్లు, సీనరేజ్ ₹.82 లక్షలు, ఎలక్ట్రిసిటి ₹.3.23 కోట్లు, ఎస్.టి.పి.₹.5.01 కోట్లతో, తొర్రేడు లో ₹.8.73 కోట్లతో రోడ్లు- ₹.1.86 కోట్లు, డ్రైనేజీ ₹.1.03 కోట్లు, నీటి సరఫరా ₹.1.77 కోట్లు, ఎలక్ట్రిసిటి ₹.90 లక్షలు, ఎస్.టి.పి.రూ. 3.02 కోట్లతో చేశారు. రాజమహేంద్రవరం ఫేజ్- I నందు బొమ్మూరు సైట్ లో 2528 ప్లాట్లకు మరియు తొర్రేడు లో మొత్తం 896 ప్లాట్లకు గాను మౌలిక సదుపాయములు అనగా రోడ్లు , డ్రైనేజి , నీటి సరఫరా , ఎలక్ట్రిసిటీ మరియు సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులు పూర్తి అయినవి , మిగిలిన బొమ్మూరు – ఫేజ్- II 1200 ప్లాట్లను డిసెంబర్ 2022 నెలలలో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టినాము . బొమ్మూరు సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులు ( 1.50 ఎం.ఎల్.డి. ) పురోగతిలో ఉన్నవి . ఎస్ . టి.పి. పనులు 3 నెలలలో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టుట జరిగినది . తొర్రేడు సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పనులు ( 0.5 ఎం.ఎల్.డి. ) పురోగతిలో ఉన్నవి . ఎస్ . టి.పి. పనులు 3 నెలలలో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టుట జరిగినది . తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన 2880 ప్లాట్లు , మోరంపూడి డి బ్లాక్ – 224 ప్లాట్లు వడ్డేదర కాలనీ 256 ప్లాట్లు, ఫేజ్- II లో నామవరం – 1104 , సింహాచలనగర్ – 96 , ధవళేశ్వరం – 1200 ప్లాట్లు డిసెంబర్ -2022 నాటికి అందజేయుటకు ఏర్పాట్లు జరుగుచున్నవి .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *