గోడౌన్ నిర్మాణం కోసం 50/25 సెంట్లు భూమిని గుర్తించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పెరవలి, కొవ్వూరు పరిధిలో మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణం కోసం 50/25 సెంట్లు భూమిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో పెరవలి, కొవ్వూరు తహశీ్దార్లు తో సంబంధించిన ల్యాండ్ రికార్డుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా, కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల (గోడౌన్) ఏర్పాటు కోసం జిల్లాలో వివిధ మండలాల్లో గోడౌన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రైతులకు అనువు గా ఉండే స్థలం సేకరణ చెయ్యాలని, ఇంజినీరింగ్ అధికారులతో క్షేత్ర స్థాయి లో పర్యటించి, సేకరణ చేస్తున్న భూమి ని చూపించి ఆమోదం పొందాలని ఆదేశించారు. కొవ్వూరు మండల పరిధిలోని గుర్తించిన స్థల ల వివరాలు తహశీల్దార్ కలెక్టర్ కు వివరించారు. అనంతరం పెరవలి మండలం పరిధిలో కానూరు, కానూరు ఆగ్రహరం, కొత్తపల్లి ఆగ్రహరం, నడిపల్లి గ్రామాల్లో అనువైన ప్రభుత్వ భూమి లేదా దాతలు ద్వారా సేకరించ గలిగే భూమి కానీ గుర్తించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు తో నిర్మించే ఈ మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల (గోడౌన్) వలన భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పెరవలి మండలం నుంచి 48 గంటల్లో కనీసం 25 సెంట్ల భూమిని గుర్తించి, నివేదికతో రావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *