-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సంపూర్ణ పోషణలో భాగంగా జిల్లాలో గర్భణిలు, బాలింతలు, చిన్నారులకు నేటి నుండే మధ్యాహ్నం భోజనంలో వేడి వేడి ఆహరం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది ఐసిడియస్ ప్రాజెక్టల పరిధిలో ఉన్న 1,475 అంగన్వాడి కేంద్రాలలో గర్భణిలు, బాలింతలు, చిన్నారులకు కోవిడ్ కారణముగా గత రెండు సంవత్సరాల నుండి నేటి వరకు ఇంటి వద్దకే మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహరాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్ అన్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే వేడి వేడి ఆహరాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగందన్నారు. దీనిలో భాగంగా తల్లిబడ్డలకు పౌష్టికాహరం అందించి ఆరోగ్యవంతలుగా చేసేందుకు అందిస్తున్న వేడి వేడి ఆహరాన్ని గర్భణిలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.
ప్రతీ వారం అందించే ఆహర మెనూలో భాగంగా సోమవారం తల్లులకు అన్నం, దోసకాయపప్పు, కోడిగుడ్డు కూర,200 మి.లీ పాలు. చిన్నారులకు అన్నం, దోసకాయపప్పు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు.
మంగళవారం తల్లులకు అన్నం, టొమాటోపప్పు, కోడిగుడ్డుకూర,200 మి.లీ పాలు. చిన్నారులకు పులిహోర, టొమాటోపప్పు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు,
బుధవారం తల్లులకు అన్నం, ఆకుకూరపప్పు, కోడిగుడ్డుకూర, 200 మి.లీ పాలు. చిన్నారులకు అన్నం ఆకుకూరపప్పు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు.
గురువారం తల్లులకు ఎగ్ప్రైడ్రైస్, ఆకుకూరపప్పు, కూరగాయలతో సాంబారు, 200 మి.లీ పాలు.
చిన్నారులకు అన్నం, ఆకుకూరపప్పు, కూరగాయలతో సాంబారు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు.
శుక్రవారం తల్లులకు అన్నం, బీరకాయ లేదా సొరకాయపప్పు, మునగాకు లేదా పాలకూరతో గుడ్డుకూర,200 మి.లీ పాలు. చిన్నారులకు అన్నం, బీరకాయ లేదా సొరకాయపప్పు, మునగాకు లేదా పాలకూరతో కూర ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు.
శనివారం తల్లులకు వెజిటబుల్ రైస్, ఆకుకూర కూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు, ,200 మి.లీ పాలు. చిన్నారులకు వెజిటబుల్ రైస్, ఆకుకూర కూర, కూరగాయలతో సాంబారు, ఉదయం అల్పాహారంగా ఉడికించిన కోడిగుడ్డు, 100 మి.లీ పాలు వారం మెనూగా పదార్థాలు ఉంటాయని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News