మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ ద్వారా మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల (బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలు) నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఏపిడిడిసిఎఫ్‌ఎల్‌ ప్రత్యేక అధికారి బాబు ఏ కు వివరించారు.
మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల (బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలు) నిర్మాణ పనులపై గురువారం ఏపిడిడిసిఎఫ్‌ఎల్‌ బోర్డు రూమ్‌ నుండి ప్రత్యేక అధికారి బాబు ఏ, మార్కెటింగ్‌ కమీషనర్‌ ప్రద్యుమ్నలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో యంపిఎఫ్‌సి గౌడౌన్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని దీనిలో భాగంగా మొదటి దశలో మంజూరైన 58 గౌడౌన్లకు సంబంధించి 32 గౌడౌన్ల నిర్మాణ పనులు, రెండవ దశలో మంజూరైన 50 గౌడౌన్లకు 22 గౌడౌన్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మిగిలిన వాటిని వారంలోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో పెనుగంచిపోలు, ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు, జగ్గయ్యపేట మండలం పోచంపల్లి, పెనుగంచిపోలు మండలం నవాబుపేట గ్రామాలలో గౌడౌన్లకు సంబందించి భూసేకరణకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వారంలోగా పరిష్కరించి పనులు ప్రారంభిస్తామన్నారు.
అనంతరం జిల్లాలో జిల్లా కోఅపరేటివ్‌ ఆఫీసర్‌ సైయద్‌ మస్తాన్‌వలీ, జిల్లా అగ్రి ట్రేడ్‌ అండ్‌ మర్కెటింగ్‌ ఆఫీసర్‌ కిషోర్‌ తదితర అధికారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాలకు అనుసందానంగా నిర్మించే మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఇంకనూ ప్రారంభం కాని వాటిని త్వరితగతిన ప్రారంభించేలా భూ సేకరణకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను సంబంధి మండల తహాశీల్థార్లతో సమన్వయం చేసుకోవాలని, ఆ స్థాయిలో పరిష్కారం కాని వాటిని తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *