విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ నందు విద్యార్థులకు అవసరమైన నిర్వహణ సేవలకై అర్హులైన పంపిణీ దారుల నుండి సీల్డు టెండర్లు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి బి విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది నగరంలోని డా బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ నందు అవసరమైన నిర్వహణ సేవలు అందించడానికి జీఎస్‌టి కలిగిన పంపిణీ దారుల నుండి సీల్డు టెండర్లు కోరుతున్నామన్నారు. ఆసక్తి కలిగిన గుత్తేదారులు ‘‘డిస్ట్రిక్ట్ ఎస్‌సి వెల్ఫెర్ అండ్ ఎన్‌ఫవర్‌మెంట్ ఆఫీసర్ ఎన్‌టిఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ’’ పేరున 3 వేల రూపాయల డిమాండ్ డ్రాప్ట్‌ను అందజేసి టెండర్ ఫారం తీసుకోవాలని తెలిపారు. పూర్తి చేసిన టెండర్ ఫారంతో పాటు 15 వేల రూపాయలు ధరావతు సొమ్ము డిమాండ్ డ్రాప్ట్‌ను పూర్తి చేసిన టెండర్ ఫారంతో జత చేసి జూలై 4వ తేదీ సాయంత్రం 6గంటల లోపు విజయవాడ పటమట పంటకాలువరోడ్డు మారుతినగర్‌నందు గల తమ కార్యాలయంలో సమర్పించాలని, స్వీకరించిన సీల్డు టెండర్లను జూలై 6వ తేది ఉదయం 11 గంటలకు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి కార్యాలయం, విజయవాడ నందు తెరవడం జరుగుతుందని జిల్లా సాంఫీుక సంక్షేమ అధికారిణి బి విజయభారతి ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News