రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం జోనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు పిల్లులకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని పశువుల ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. టి ఎస్ రమేష్ చంద్ర మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున పెంపుడు కుక్కలకు, పిల్లులకు బుధవారం స్థానిక పశువుల ఆసుపత్రి, దేవిచౌక్ సమీపం, రాజమహేంద్రవరం లో రాబీస్ వ్యాధి రాకుండా నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకుని వారి పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సిన్ (టీకాలు) వేయించాలని డా. రమేష్ చంద్ర కోరారు. మొదటి రాబిస్ వ్యాక్సిన్ను రూపకర్త లూయిస్ పాశ్చర్ యొక్క జన్మ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది జూలై 6 న జోనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని వ్యాక్సినేషన్ వెయ్యడం జరుగుతోందని వెల్లడించారు.
Prajavartha Online Telugu News