-విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలు చేరుకొగలుగుతారు…
-హోం మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు(పంగిడి), నేటి పత్రిక ప్రజావార్త :
ఏ లక్ష్యం సాధించాన్నా విద్య, విజ్ఞానం ఉండాలని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు మండలం పంగిడి జిల్లా పరిషత్తు హైస్కూల్ జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత , జిల్లా కలెక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఒక మేనమామగా ఆలోచించి , తల్లిదండ్రులు తీసుకోవలసిన బాధ్యతను తీసుకుని మన పిల్లలకు మంచి చదువును చెప్పించడం జరుగుతోందన్నారు. ప్రవేటు, కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈరోజు నేను, కలెక్టర్ ఈ స్థాయి లో ఉన్నామంటే అందుకు విద్యే కారణం అన్నారు. మంచి చదువు అందించడం కోసం పిల్లలకు పుస్తకాలు, స్కూల్ కిట్స్ అందించడం జరిగిందన్నారు. గతంలో లేని విధంగా నేడు మన ప్రభుత్వం స్కూల్స్ లో చదివే పిల్లలకు చక్కని స్కూల్ డ్రెస్ , బూట్స్ , సాక్స్, స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వడం లో ఎంతో భాద్యతగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత మేనమామలా ఆలోచించడం జరిగిందని మంత్రి తానేటి వనిత తెలిపారు. పిల్లలు కూడా ఆలోచన చెయ్యాలి ఈరోజు మీరు అందుకుంటున్న అవకాశాలు గతంలో ఉండేవి కావన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షల కుటుంబాల్లో విద్యాదీపం వెలిగించారన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంతోపాటు డ్రాప్స్ ఉండకూడదనే లక్ష్యంతో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందించడంతో పేద వర్గాలకు చెందిన అనేకమంది నేడు లక్ష్యాలను సాధించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని తెలిపారు. ఆయన వారసుడిగా జగనన్న మరో నాలుగడుగులు ముందుకు వేసి అమ్మ ఒడి ఆ పై చదువులకు విద్యాదీవేన,వసతి దీవన అందిస్తున్నారన్నారు.తల్లితండ్రులు తమ పిల్లలు పట్ల బాధ్యతలను తీసుకొని వారిని చదివిస్తూ ప్రోత్సహించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డా కే.మాధవీ లత మాట్లాడుతూ చదువే భావితరాలకు అందించే ఆస్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో విద్య పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేయిస్తున్నారన్నారు. తల్లి తండ్రులు విద్య విషయంలో పిల్లలు మధ్య వత్యాసం చూపవద్దన్నారు. పిల్లల్లో చిన్నతనం నుంచే ఉన్నత విలువలు, లక్ష్యాలు దిశగా ప్రోత్సాహం ఇవ్వగలిగితే తప్పకుండా విజయం సాధించ గలుగుతారన్నారు.
గ్రూప్ పరీక్షల్లో ఎందుకు ఐ ఎ ఎస్ కావాలనే ప్రశ్న అడుగుతారు, అందరూ చెప్పే సమాధానం విద్య, వైద్య కు ప్రాధాన్యత ఇస్తామనే సమాధానం చెప్పటం జరుగుతుంది. అయితే సర్వీస్ లోకి వొచ్చకా ప్రభుత్వ ప్రాధాన్యత మేరకు పనిచేయాల్సి ఉంది. అయితే ఈ ప్రభుత్వం విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఒక మంచి పరిమాణం అన్నారు. జిల్లాలో విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కింద సెకండ్ పేజ్ లో 564 సంబంధించి రూ.162 కోట్లు నిధులు ఖర్చు చెయ్యడం ద్వారా విద్యకు విద్యుకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో తెలుస్తుందన్నారు. పాఠశాలల ఆధునీకరణ పనుల్లో నాణ్యత బాగుండాలనే లక్ష్యంతో పేరెంట్స్ కమిటీని ప్రభుత్వ ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాల ఆధునీకరణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ అందించడం శుభ పరిణామం అన్నారు.
పిల్లలలోని ఆసక్తిని తెలుసుకుని వారు డాక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, పోలీస్ అవుతాను అనే వారి ఆశయ సాధనకు తగిన ప్రోత్సహం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. క్రమశిక్షణ, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు. 99 శాతం కృషి, పట్టుదల ఉంటే విజయం సాధించ గలుగుతార న్నారు. అయితే అదృష్టం మాత్రం ఒక్క శాతం ఉంటుంది అని పేర్కొన్నారు.
సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గోశాల నాగార్జున మాట్లాడుతూ, పేద, నిరుపేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించడం కోసం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాలోని 1007 స్కూల్స్ లో జగనన్న విద్యా కానుక కిట్స్ అందించడం జరుగుతుందని జిల్లా విద్యా దికారి ఎస్.అబ్రహం తెలిపారు. మొత్తం 1,53,706 మంది విద్యార్థులకు కిట్స్ ఇస్తుండగా, బాలికలు 76234మంది, బాలురు 77472 మంది కిట్స్ అందుకోనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాలలో రు.276.60 లక్షల తో నిర్మించనున్నఆదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్, గోశాల నాగార్జున, డి. ఈ ఓ, ఎస్. అబ్రహం, కొవ్వూరు ఆర్. డి. ఓ, ఎస్. మల్లిబాబు, యం. పి. పి., కాకర్ల సత్యనారాయణ, వైస్ యం. పి. పి. వీరమళ్ళ నారాయుడు, యం. పి. టి. సీ., కొనాల భవాని, యం. ఈ. ఓ, జె. కెంపు రత్నం, ఎస్.ఈ.,ఆర్. డ బ్ల్యూ. ఎస్, డి. బాలశంకర రా వు, పిడి, డ్వామా పి. జగదాంబ, ఎ. డి., ఏపీ. ట్రాన్స్ కో, పి. అచ్యుతాచారి, ఆర్. డబ్ల్యూ. ఎస్, డి.ఈ, సిహెచ్. రమేష్, మండల తాహిసీల్దారు బి. నాగరాజు నాయక్, తదితరులు విద్యార్థులు, తల్లితండ్రులు, స్కూల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News