వివిధ శాఖల పనితీరుపై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించిన మెరుగైన ఫలితాలు ఎందుకు సాధించలేక పోతున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

ప్రతి గురువారం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులతో వివిధ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన విసి లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల వారీగా సమీక్షించి, దిశా నిర్దేశం చేశామన్నారు. ఎప్పటికప్పుడు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేయడం, అందుకి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు నివేదిక ప్రకారం పూర్తి చెయ్యడం కోసం సూచనలు చేశామన్నారు. కొద్ది పాటి లక్ష్యాలను ఇచ్చి ఒత్తిడి అధిగమించే అవకాశం ఇవ్వడం ద్వారా పనుల్లో నాణ్యత తో కూడిన పనితీరుకు అవకాశం ఉందన్న విషయం తెలియ పరిచామన్నరు.

తొలుత అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం కోసం జిల్లాలో 390 గ్రామ సచివాలయ భవనాల్లో 251 పూర్తి చేసి, 138 ప్రగతిలో ఉండగా, గతవారం రోజుల్లో ఒక్కటి కూడా ఎందుకు పూర్తి చెయ్యలేదని అడిగారు. అదేవిధంగా అర్భికే లు 373 కు 176 పూర్తిచేయ్య గా, 3 భవనాలు మాత్రమే తుది దశకు చేరుకోవడం ఏమిటని, కనీసం 10 భవనాలు లక్ష్యం పెట్టు కోవలన్నారు. హెల్త్ క్లినిక్స్ 337 లో 112 పూర్తిచేసి, ఈ వారంలో మరో 3 పూర్తి చెయ్యడం జరిగిందని తెలిపారు. స్టేజ్ కన్వర్షన్ పై మరింతగా దృష్టి పెట్టాలన్నారు. ఉపాధిహామీ పనుల్లో జూన్ నెలాఖరుకి 26 లక్షలు పనిదినాలకు 29 లక్షలు సాధించినా, ఇంకా ఎక్కువ పనిదినాలు కల్పనకు అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. బల్క్ మిల్క్ యూనిట్స్ జిల్లాకు 79 లక్ష్యం కాగా 49 పూర్తి అయి ఒకటి పూర్తి చేసే స్థాయి లో ఉండగా, మిగిలిన భవనాలు కూడా వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలన్నారు. అమృత సరోవర్ పథకం కింద జిల్లాకు 70 యూనిట్స్ ఇవ్వగా, ఇప్పటి వరకు 42 కు సంబందించి పంపిన ప్రతిపాదనల కు ఆమోదం పొందడం జరిగిందని, మిగిలిన వాటికి కూడా ప్రతిపాదనలు సాధ్యమైనంత తొందర లో చేపట్టాలన్నారు.

గ్రామ పంచాయతీ పరిధిలో క్లాప్ కార్యక్రమం కింద 300 పంచాయతీల్లో 393 గ్రామ సచివాలయల్లో క్లాప్ ప్రోగ్రాం చేపట్టి 241 నేటికీ పూర్తి చేశారని తెలిపారు. వారం వారం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం పై అభినందన తెలిపారు. అయితే సామూహిక మరుగుదోడ్ల నిర్మాణం లో అనుకున్న మేరకు ప్రగతి లేదని అన్నారు. జిల్లాలో జగనన్న సంపూర్ణ భూ హక్కు, భూ రక్ష పథకంలో 109 గ్రామాల్లో చేపట్టగా, 49 గ్రామాల్లో పూర్తి, మిగిలిన చోట ప్రగతి లో ఉందన్నారు. ఈ వారం 15 గ్రామాల లక్ష్యం నిర్దేశించగా 11 పూర్తి చేసి, 4 చోట్ల తుది దశలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో డ్వామా పీడీ పి. జగదాంబ, డిపివో జే వివి సత్యనారాయణ, ఎస్ ఈ పి ఆర్ ఎ వి బి ప్రసాద్, ఆర్ డబ్ల్యు ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *