Breaking News

జూలై 7 న జాబ్ మేళా విశేష స్పందన

-వికాస, కలెక్టరేట్, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
-ఈరోజు 101 మంది ఇంటర్వూలకు హాజరు కాగా 46 మందికి ఎంపికయ్యారు
-ప్రిన్సిపాల్ జే.సునీత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు చేపట్టిన జాబ్ మేళా లో 46 మంది వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే.సునీత పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొవ్వూరు ప్రాంగణంలో వికాస ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వూ లను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జే. సునీత మాట్లాడుతూ, ఈరోజు జరిగిన ఇంటర్వూల కోసం మొత్తం 101 మంది హాజరుఆవ్వగా వారిలో 46 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను పొందడం, వారికి నియామక పత్రాలు అంద చేశామన్నారు. వీరిలో కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థులు 22 మందిఉన్నారని తెలియచేశారు. ఇది ఎంతో గర్వంగా ఉందన్నారు . ఉద్యోగాలు పొందిన యువతకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ, చక్కని ప్రతిభను చూపి, నైపుణ్యం పెంచుకుంటే మరింత ఉన్నత స్థాయి కి చేరుకో గలరని పేర్కొన్నారు.

వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జే. సత్యనారాయణ మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, యువతకు ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ తరగతులను కూడా నిర్వహించి, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వికాస్ ద్వారా బహుళజాతి కంపెనీలకు కావలసిన మానవ వనరుల కోసం అవసరమైన శిక్షణ అందించే ప్రయత్నం కూడా చెయ్యడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న యువత వారి పేర్లను జిల్లా కలెక్టరేట్ నందు గల వికాస్ కేంద్రం లో వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

ఈరోజు చేపట్టిన ఇంటర్వూలో బహుళ జాతియ కంపెని లు కొగ్నిజెంట్ – 32 మందికి, ఈసుజు -6 ,ఇండిగో ఎయిర్ లైన్స్ – 3, హుండై మొబిస్ – 1 , ఎన్‌ఐ‌ఐ‌టి (ఐసిఐసిఐ) – 2, డెక్కన్ కెమికల్ -2 మంది ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసా రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *