ఆంధ్రప్రదేశ్‌ను రైతాంగానికి స్వర్ణసీమగా మార్చిన నేత, రైతు బాంధవుడు వైఎస్సార్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతును రాజును చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ప్రతి అడుగు.. ఆయనను ప్రజల హృదయాలలో రైతు బాంధవుడిగా నిలిపిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్నదాతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2004 కి ముందు తెలుగుదేశం పాలనలో రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. రాజన్న పాలనలో అన్నదాతలకు ప్రతిరోజూ ఓ సంక్రాంతి పండుగలా సాగిందన్నారు. ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయానికి వెన్నుద‌న్నుగా నిలిచారన్నారు. జలయజ్ఞంతో అనేక నూతన సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి.. రైతు బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చివేశారన్నారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించి ఉమ్మడి కృష్ణా జిల్లా వరప్రదాయిని అయినటువంటి పులిచింతలను పూర్తిచేసిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన హయాంలోనే 75 శాతం భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు. కనుకనే రాజన్న జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.

నగర అభివృద్ధిపై రాజన్నది చెరగని ముద్ర
దేశంలో సంక్షేమ పథకాల విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మల్లాది విష్ణు అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యులు అని చెప్పుకొచ్చారు. 2004 కి ముందు 2004 తర్వాత అన్న విధంగా పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కార్మిక, కర్షక, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు హర్షించేలా సువర్ణ పాలనను అందించారని పేర్కొన్నారు. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తించేలా చేశారన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను మహానేత వైఎస్‌ఆర్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకం వివిధ పేర్లతో అమలవుతోందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో ఖరీదైన విద్యను పేద విద్యార్థులకు చేరువ చేశారన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలోనూ రాజన్నది చెరగని ముద్ర అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పేదలకు JNNURM ఇళ్లు, నూజివీడులో ట్రిపుల్ ఐటీ, మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫైఓవర్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో నగర రూపురేఖలను పూర్తిగా మార్చివేశారన్నారు. అటువంటి గొప్ప నాయకులు ప్రమాదవ శాత్తు మరణించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని విజయవాడ నగర ప్రజల తరపున ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *