Breaking News

రాష్ట్ర స్థాయి ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం

-పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు
-ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ సన్నాహక సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి ప్లీనరీతో సెంట్రల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం వచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ నెల 8, 9 తేదీలలో గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ సన్నాహాక సమావేశం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి సహా వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గస్థాయి ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించారు. ఐదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో.. పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజం నిండుకుందని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యంగా ప్రతి కార్యకర్త పేరున స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వాన లేఖ రాయడం గొప్ప విషయమన్నారు. కనుక ప్రతిఒక్కరూ ప్లీనరీ నిర్వహణలో భాగస్వామ్యులై పనిచేయాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్దాయి ప్లీనరీలను కార్యకర్తల ఉత్సాహాల మధ్య విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు. ఇదే ఉత్సాహాన్ని రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలలోనూ చూపాలన్నారు. లక్షల సంఖ్యలో అభిమానులు హాజరవుతున్న సమావేశాన్ని జయప్రదం చేయడంలోనే పార్టీ శ్రేణుల క్రమశిక్షణ అందరికీ తెలుస్తుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధ ఆకట్టుకుందన్నారు. జగనన్న వేసిన రహదారులపై భారీగా తరలివెళ్లి.. ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుదామని పిలుపునిచ్చారు. చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడేలా రీతిలో నిర్వహించుకుందామన్నారు. కార్యకర్తలకు వసతి, భోజనం, రవాణా వంటి అన్ని సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, బాలి గోవింద్, ఎండి షాహినా సుల్తానా, కొండాయిగుంట మల్లీశ్వరి, అలంపూర్ విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, యరగొర్ల తిరుపతమ్మ, పెనుమత్స శిరీష సత్యం, కుక్కల అనిత, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, ఉద్ధంటి సునీత, జానా రెడ్డి, కొంగితల లక్ష్మిపతి, కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఆత్మకూరి సుబ్బారావు, అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, అలంపూర్ విజయ్, ఇసరపు రాజారమేష్, బంకా భాస్కర్, యరగొర్ల శ్రీరాములు, శ్యామ్, కనపర్తి కొండా, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *